breaking news
Saanve Megghana
-
పద్ధతిగా నిధి అగర్వాల్.. మాల్దీవుల్లో తెలుగమ్మాయి
పద్ధతిగా పట్టుచీరలో హీరోయిన్ నిధి అగర్వాల్మాల్దీవులు ట్రిప్‌లో తెలుగమ్మాయి శాన్వి మేఘనచీరలో మెరిసిపోతున్న హాట్ బ్యూటీ శ్రద్ధాదాస్ఫ్రాన్స్లో తెగ తిరిగేస్తున్న తమిళ నటి గౌరీ కిషన్హీరోయిన్ నభా నటేశ్ రీసెంట్ జ్ఞాపకాలువర్షంలో డ్యాన్స్ చేస్తూ హ్యాపీగా ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) -
'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
నేరుగా ఓటీటీలోకి కామెడీ సినిమా.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు మాత్రం నేరుగా వీటిలోనే రిలీజ్ చేస్తుంటారు. అలా ఓ క్రేజీ లవ్ స్టోరీ కామెడీ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేసి చిత్రం ఎలా ఉండబోతుందో చెప్పేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎప్పుడు ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)ఎలన్ హీరో కమ్ దర్శకుడిగా చేసిన తమిళ సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం'. తెలుగమ్మాయి శాన్వి మేఘన హీరోయిన్. రాధిక కీలక పాత్ర చేసింది. దీనిని వచ్చే శుక్రవారం(ఆగస్టు 21) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.'ప్యార్ ప్రేమ కళ్యాణం' విషయానికొస్తే.. ఓ అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకుంటారు. సాధారణంగా వివాహం తర్వాత అమ్మాయి అత్తగారింటికి వెళ్తుంది. కానీ ఇక్కడ అమ్మాయి, తన భర్తని ఇల్లరికం రమ్మని అడుగుతుంది. భార్యనే కదా అని అంగీకరిస్తాడు. అక్కడ నుంచి కష్టాలు మొదలు. మరి ఈ అబ్బాయి.. అత్తారింట్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ. సీరియస్ విషయమే అయినప్పటికీ కామెడీగా దీనిని చూపించబోతున్నారని ట్రైలర్ బట్టి అర్థమవుతుంది.(ఇదీ చదవండి: హీరో సూర్య ముందు అద్భుతమైన అవకాశం) -
శాన్వీ మేఘన లేటేస్ట్ మూవీ.. నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్
టాలీవుడ్ నటి శాన్వీ మేఘన, ఎలన్ జంటగా వస్తోన్న లవ్ అండ్ రొమాంటిక్ మూవీ క్రేజీ లవ్. ఈ చిత్రానికి ఎలన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ప్రేమ, పెళ్లి కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు పోస్టర్స్ చూస్తే తెలిసిపోతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.ఈ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 21 నుంచి ఓటీటీకి రానుందని తేదీని రివీల్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి ప్యార్ప్రేమకల్యాణ్ అనే సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఈ పాటను మ్యూజిక్ ఫ్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా.. ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్, యోగి బాబు, సెంథిల్, కుమారవేల్, మారన్, గీతా కైలాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. #CrazyLove song from #PyaarPremaKalyanam is streaming now! 🎶🔗 https://t.co/gZqMcWraOpStreaming on Netflix from Aug 21 pic.twitter.com/37VAgu5Nlj— Sathish Kumar M (@sathishmsk) August 6, 2026 -
నేరుగా ఓటీటీలోకి లవ్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. అంటే చాలావరకు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నప్పటికీ కొన్ని మాత్రం నేరుగా స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా అలానే ఓ మూవీకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ తేదీని ప్రకటించారు. తెలుగమ్మాయి శాన్వి మేఘన హీరోయిన్గా చేసిన చిత్రమిది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి ఎప్పుడు రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలో క్రైమ్ కామెడీ సినిమా 'కాన్ సిటీ' తెలుగు రివ్యూ)తమిళ నటుడు ఎలన్.. హీరోగా పరిచయమవుతూ దర్శకుడిగా మారి తీసిన సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం', తెలుగమ్మాయి శాన్వి మేఘన హీరోయిన్. గతేడాది ఈ మూవీ గురించి న్యూస్ వచ్చింది. ఇప్పుడు దీన్ని వచ్చే నెల 21న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఇది అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.'ప్యార్ ప్రేమ కళ్యాణం' విషయానికొస్తే.. పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లకుండా తన ఇంట్లోనే ఉండాలని ఓ అమ్మాయి(శాన్వి మేఘన) నిర్ణయించుకుంటుంది. దీంతో ఆమె భర్త (ఎలన్) ఇల్లరికం రావాల్సి వస్తుంది. ఈ కారణంగా ఇరు కుటుంబాల్లో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరకు తమ జీవితాన్ని తాము ఎలా మలుచుకోవాలనే విషయాన్ని ఈ జంట ఎలా తెలుసుకుంటుంది? అనేదే స్టోరీలా అనిపిస్తుంది.ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, యోగి బాబు, ఎం.ఎస్. భాస్కర్, గీతా కైలాసం తదితరులు కీలక పాత్రలు చేశారు. యువన్ శంకర్ రాజా సంగీతమందించాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)Indha maari oru save the date ah neenga paathrukave maateenga 🤭🤣 pic.twitter.com/XLS3oR38Nd— Netflix India South (@Netflix_INSouth) July 27, 2026 -
మాల్దీవుల్లో తెలుగు బ్యూటీ.. ప్రీతి ముకుందన్ స్మైల్
మాల్దీవులు ట్రిప్ వేసిన తెలుగమ్మాయి శాన్వీపచ్చని డ్రస్‌లో రాశీ సింగ్ అందాల జాతరనవ్వుతూ మాయ చేస్తున్న ప్రీతి ముకుందన్మంచులో ఎంజాయ్ చేస్తున్న ప్రియా వారియర్'లెనిన్' షూటింగ్ మర్చిపోలేకపోతున్న భాగ్యశ్రీవైరల్ పాటకు ఆషికా రంగనాథ్ సూపర్ డ్యాన్స్ View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) View this post on Instagram A post shared by Rajisha Vijayan (@rajishavijayan) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Jone Kingston (@jonekingston) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) -
అల్లు అర్జున్ వీరాభిమాని శాన్వీ మేఘన దీపావళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
Tuk Tuk Movie: ‘టుక్ టుక్’ మూవీ రివ్యూ
మన తెలుగమ్మాయి శాన్వి మేఘన, ఇటీవల కోర్ట్ సినిమాతో హిట్ కొట్టిన హర్ష్ రోషన్, సలార్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ దేవ్, సోషల్ మీడియా ఫేమ్ స్టీవెన్ మధు, నిహాల్ కోదాటి.. ముఖ్య పాత్రల్లో ఈ టుక్ టుక్ సినిమా తెరకెక్కింది. మూడు చక్రాల బండిని టుక్ టుక్ అంటాం. మరి ఈ సినిమాలో టుక్ టుక్ చేసిన విన్యాసాలు ఏంటి అనేది రివ్యూలో(Tuk Tuk Telugu Movie Review) చూద్దాం. కథేంటంటే..ముగ్గురు టీనేజ్ కుర్రాళ్ళు(హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు) డబ్బుల కోసం వినాయకుడి విగ్రహం పెట్టి వినాయకచవితి చేస్తారు. ఆ ఊళ్ళో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఉండటం, నిమజ్జనానికి బండి దొరకకపోవడంతో ఈ ముగ్గురు కలిసి ఒక పాత స్కూటర్ ని ముగ్గురు కూర్చునే టుక్ టుక్ బండిలా తయారుచేస్తారు. ఆ బండిలోనే వినాయకుడి నిమజ్జనం ఊరేగింపు చేస్తారు. ఆ తెల్లారి నుంచి ఆ బండి దానంతట అదే ఆపరేట్ అవుతుండటంతో అందులో దేవుడు వచ్చాడు అనుకుంటారు. దీంతో స్కూటర్ లో దేవుడు ఉన్నాడు, ఏం అడిగినా హ్యాండిల్ అటు ఇటు ఊపి అవునా, కదా అని సమాధానాలు చెప్తాడు అని ఊళ్ళో ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించుకుంటారు.ఈ క్రమంలో ఆ స్కూటర్ లో ఉంది దేవుడు కాదు ఆత్మ అని తెలుస్తుంది. ఈ ముగ్గురు కుర్రాళ్ళని కాస్త భయపెడుతుంది కూడా. మరి ఆ స్కూటర్ లో ఉన్న ఆత్మ ఎవరిది? ఆ స్కూటర్ లో ఎందుకు ఉంది? ఈ ముగ్గురు కుర్రాళ్ళు అందులో ఆత్మ ఉందని తెలిసాక ఏం చేసారు? నవీన్(నిహాల్ కోదాటి) - శిల్ప(శాన్వి మేఘన)ల ప్రేమ కథేంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..వెహికల్ దానంతట అదే ఆపరేట్ అవ్వడం, భయపెట్టడం, నవ్వించడం గతంలో తెలుగులో బామ్మ మాట బంగారు బాట, కారా మజాకా, మెకానిక్ మామయ్య లాంటి పలు సినిమాల్లో చూసాం. ఈ టుక్ టుక్ కూడా అలాంటిదే. మూడు చక్రాల బండిలో ఆత్మ ఉంటే అది ఎలాంటి విన్యాసాలు చేసింది అని సరదాగా చూపించారు. ముగ్గురు టీనేజీ కుర్రాళ్ళు ఓ బండి తయారు చేయడం, ఆ బండిలో దేవుడు ఉన్నాడు అని దాంతో డబ్బులు సంపాదించడం సీన్స్ అన్ని కాస్త నవ్విస్తూనే ఆసక్తిగా ఉంటాయి.ఆ బండిలో ఆత్మ ఉందని తెలిసాక వాళ్ళు భయపడటం, అది వీళ్ళను పరిగెత్తించడం బానే నవ్విస్తాయి. స్కూటర్ మాట్లాడలేదు కానీ అది పిల్లలు అడిగే ప్రశ్నలకు ఇండికేషన్స్ ఇస్తూ సమాధానాలు చెప్పడం కొత్తగా ఉంటుంది. అయితే ఆ ఆత్మ కథేంటి అని ఫ్లాష్ బ్యాక్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. అసలు ఆ ఆత్మ అందులోకి ఎలా వచ్చింది అనేది మాత్రం సరైన క్లారిటీ ఇవ్వలేదు. లవ్ స్టోరీ కొత్తగా చూపించే ప్రయత్నం చేసారు. సెకండ్ హాఫ్ మాత్రం కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా సింపుల్ గా ముగించినట్టు అనిపిస్తుంది. హీరోయిన్ పాత్రను బాగా రాసుకున్నారు. అలాగే సినిమాలో ఓ మెసేజ్ చెప్పడానికి కూడా ప్రయత్నించారు. సినిమాకు సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడం గమనార్హం.ఎవరెలా చేశారంటే..మన తెలుగమ్మాయి శాన్వి మేఘన తన క్యూట్ అందంతో మెప్పిస్తునే ధైర్యవంతురాలైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో చక్కగా నటించింది. ముగ్గురు టీనేజీ కుర్రాళ్ళ పాత్రల్లో హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు ఫుల్ ఎనర్జీతో నవ్విస్తూనే బాగా నటించారు. నిహాల్ కోదాటి పర్వాలేదనిపిస్తాడు. మిగిలిన పాత్రలు కూడా తమ పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. పచ్చని లొకేషన్స్ ని సినిమాటోగ్రఫీ విజువల్స్ తో మరింత అందంగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. పాటలు కూడా వినడానికి బాగున్నాయి. టుక్ టుక్ బండిని బాగా డిజైన్ చేసారు. దర్శకుడు ఓ కొత్త పాయింట్ ని టుక్ టుక్ (Tuk Tuk Movie Review)బండితో నవ్విస్తూ చెప్పాడు. నిర్మాణవిలువలు చిన్న సినిమా అయినా ఉన్నతంగా ఉన్నాయి.నటీనటులు: హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి.. తదితరులునిర్మాత: రాహుల్ రెడ్డి దర్శకత్వం: సి.సుప్రీత్ కృష్ణసంగీతం: సంతు ఓంకార్ సినిమాటోగ్రఫీ: కార్తీక్ సాయి కుమార్ ఎడిటర్: అశ్వత్ శివకుమార్ విడుదల తేది: మార్చి 21, 2025


