టాలీవుడ్ నటి శాన్వీ మేఘన, ఎలన్ జంటగా వస్తోన్న లవ్ అండ్ రొమాంటిక్ మూవీ క్రేజీ లవ్. ఈ చిత్రానికి ఎలన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ప్రేమ, పెళ్లి కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు పోస్టర్స్ చూస్తే తెలిసిపోతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.
ఈ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 21 నుంచి ఓటీటీకి రానుందని తేదీని రివీల్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి ప్యార్‌ప్రేమకల్యాణ్ అనే సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఈ పాటను మ్యూజిక్ ఫ్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా.. ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్, యోగి బాబు, సెంథిల్, కుమారవేల్, మారన్, గీతా కైలాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
#CrazyLove song from #PyaarPremaKalyanam is streaming now! 🎶
🔗 https://t.co/gZqMcWraOp
Streaming on Netflix from Aug 21 pic.twitter.com/37VAgu5Nlj— Sathish Kumar M (@sathishmsk) August 6, 2026


