ఓటీటీకి జన నాయగన్.. స్ట్రీమింగ్ డేట్ వైరల్..! | Vijay Jana Nayagan OTT Release Date goes Viral | Sakshi
Sakshi News home page

Jana Nayagan OTT: ఓటీటీకి జన నాయగన్.. స్ట్రీమింగ్ అప్పుడేనా..?

Aug 6 2026 4:53 PM | Updated on Aug 6 2026 5:12 PM

Vijay Jana Nayagan OTT Release Date goes Viral

దళపతి విజయ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ జన నాయగన్(తెలుగులో జన నాయకుడు).  పొలిటికల్ ఎంట్రీ ముందు నటించిన చివరి సినిమా ఇదే. రాజకీయాల్లోకి వచ్చేముందే  ఇదే తన చివరి చిత్రమని ప్రకటించారు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది. ఎట్టకేలకు విజయ్ సీఎం అయ్యాక ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. 

జూలైలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ.. అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. విజయ్ ఫ్యాన్స్‌లో క్రేజ్‌ ఉండడంతో కలెక్షన్స్ పరంగా ఫర్వాలేదనిపించింది. దీంతో థియేటర్లలో ఓ మాదిరిగా ఆకట్టుకున్న జన నాయగన్‌ ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే జన నాయగన్ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి క్రేజీ న్యూస్ వైరలవుతోంది.  ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు నెల రోజుల్లోపే రానుందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ జీ5 సొంతం చేసుకుంది. ఈ నెల 21 నుంచి తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. కాగా.. ఈ మూవీకి హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రియమణి, రేవతి, సునీల్, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement