మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్‌కు వింత అనుభవం ఎదురైంది. ఓ ఈవెంట్‌కు హాజరైన ఈ ముద్దుగుమ్మకు ఆమె వేసుకున్న డ్రెస్ గురించి కొందరు ప్రశ్నించారు. మీరెందుకు ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు? దీనికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? అని ప్రియాను అడిగారు. దీనికి కాస్తా అసౌకర్యానికి గురైన ప్రియా అలాంటిదేం లేదని బదులిచ్చింది.
ఇలాంటి సిల్లీ ప్రశ్నలు వేసి హీరోయిన్లను ఇబ్బంది పెట్టడమేంటని నెటిజన్స్ ఫైరవుతున్నారు. సినిమా గురించి అడగకుండా ఆమె డ్రెస్ కలర్‌తో పనేంటని రిపోర్టర్‌కు గడ్డిపెడుతున్నారు. హీరోయిన్ల నటించిన మూవీ గురించి ప్రశ్నలు అడగితే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. కేరళలో కాషాయ రంగు దుస్తులు ధరిస్తే కూడా కారణం చెప్పాలా? వ్యక్తిగత స్వేచ్ఛ లేదా?" అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#PriyaPrakashVarrier@Priyavarrier08 pic.twitter.com/v8RUt3R1q2
— Sillarai Siruvar (@SillaraiSiruvar) August 5, 2026


