నక్షత్ర, కృష్ణ కొమ్మాలపాటి, రోషన్, సాయిదుర్గా తేజ్, రమేష్ బండ్రెడ్డి, హరీష్ శంకర్
హర్ష్ రోషన్ , నక్షత్ర జంటగా నటించిన సినిమా ‘తెల్లకాగితం’. నందు సవిరిగాన కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించిన ఈ సినిమాకు రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహించారు. కె. శ్రీదేవి సమర్పణలో అరుణాచల క్రియేషన్స పతాకంపై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హీరో సాయిదుర్గా తేజ్, దర్శక–నిర్మాత హరీష్ శంకర్, రచయిత కోన వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘రోషన్ మంచి సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూ ఉంటాడు.
నందు అద్భుతమైన రైటర్. ఇలానే మంచి కథల్ని రాస్తూ ఉండు అని నందుకి చెబుతూనే ఉంటాను. నేల మీద నడిచే కథ ఇది. ‘ఇరుముడి’ స్థాయిలో ఈ చిత్రం హిట్ అవుతుంది. ఈ సినిమాతో దర్శక–నిర్మాతలకు మంచి విజయం లభించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. మరో అతిథి సాయిదుర్గా తేజ్ మాట్లాడుతూ– ‘‘తెల్ల కాగితం’ చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ చూసి, పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు. ‘‘తెల్లకాగితం’ సినిమా రోషన్‌కి ఓ మైల్‌స్టోన్ మూవీగా నిలిచిపోవాలి. ఈ బ్యానర్‌లో నేను ఓ సినిమా చేస్తాను’’ అని తెలిపారు హరీష్ శంకర్.
‘‘తెలిసీ తెలియని ఒక వయసులో చేసే తప్పుల్ని ఆధారంగా చేసుకుని, ‘తెల్ల కాగితం’ సినిమాని తీశాం’’ అని చెప్పారు హర్ష్ రోషన్ . ‘‘మీ (ఆడియన్స్) లైఫ్, మీరు చేసిన తప్పులు, మీరు చెప్పుకోలేని వన్నీ ‘తెల్లకాగితం’ సినిమాలో ఉంటాయి. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు దర్శకుడు రమేష్ బండ్రెడ్డి. ‘‘తెల్లకాగితం’ సినిమా రిలీజ్‌కు ముందు చిన్న సినిమా. రిలీజ్ అయ్యాక పెద్ద చిత్రం అవుతుంది’’ అని చె΄్పారు రైటర్ నందు. ‘‘ఈ చిత్రంలో ఆశ అనే పాత్రలో నటించాను. అమాయకత్వంతో కూడిన ఇలాంటి మంచి పాత్ర ప్రేక్షకులందరికీ కనెక్ట్ అవుతుంది’’ అని పేర్కొన్నారు నక్షత్ర.


