పుష్ప మూవీ ఎఫెక్ట్.. ప్రభుత్వానికి నాని రిక్వెస్ట్ | Hero Nani Request To ts Govt For watch the Paradise Movie at Rtc x Roads | Sakshi
Sakshi News home page

The Paradise Movie: పుష్ప మూవీ ఎఫెక్ట్.. ప్రభుత్వానికి నాని రిక్వెస్ట్

Sep 22 2026 10:10 PM | Updated on Sep 22 2026 10:10 PM

Hero Nani Request To ts Govt For watch the Paradise Movie at Rtc x Roads

టాలీవుడ్ హీరో నాని తెలంగాణ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. ఓ సినిమా హీరోగా తాను ప్రేక్షకులతో కలిసి నా మూవీ ఆస్వాదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో ‍అభిమానులతో కలిసి మూవీ చూసేందుకు అనుమతించాలని సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తెలంగాణ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అన్ని రకాల నిబంధనలు, భద్రతా చర్యలు పాటిస్తామని హీరో ట్వీట్ చేశారు. నా అభ్యర్థనను సీఎం, సినిమాటోగ్రఫి మంత్రి పరిశీలిస్తారని ఆశిస్తున్నట్లు తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

అల్లు అర్జున్‌ పుష్ప-2 రిలీజ్‌ సమయంలో జరిగిన సంఘటన వల్లే నాని ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అనుమతి కోరినట్లు తెలుస్తోంది. పుష్ప-2 రిలీజ్ టైమ్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించగా.. ఆమె కుమారుడు తేజ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఆ కుటుంబానికి అల్లు ‍అర్జున్‌ అండగా నిలిచారు.

నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్‌ మూవీ ది ప్యారడైజ్. ఈ సినిమా రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఒకరోజు ముందుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈనెల 23న సాయంత్రం ఆరు గంటల నుంచే ది ప్యారడైజ్‌ హంగామా షురూ కానుంది. ప్రీమియర్ షో (సెప్టెంబర్ 23) కోసం ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌లోని థియేటర్‌కు వచ్చి వీక్షించేందుకు నాని సిద్ధమవుతున్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో మోహన్ బాబు, సంపూర్ణేశ్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషించారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement