మగాళ్లు మెచ్యూర్ అవ్వరా?.. తెల్లకాగితం ట్రైలర్ వచ్చేసింది | Harsh Roshan and Nakshatra starrer Thellakaagitham Official Trailer | Sakshi
Sakshi News home page

Thellakaagitham Trailer: మగాళ్లు మెచ్యూర్‌ అయ్యేది అప్పుడే?.. తెల్లకాగితం ట్రైలర్ చూశారా?

Sep 22 2026 6:13 PM | Updated on Sep 22 2026 6:13 PM

Harsh Roshan and Nakshatra starrer Thellakaagitham Official Trailer

కోర్ట్‌ ఫేమ్‌ హర్ష్ రోషన్ హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ తెల్ల కాగితం. ఈ సినిమాకు రమేష్‌ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నక్షత్ర హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీని అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్‌ చేయగా.. ఆడియన్స్‌ ఆదరణ దక్కించుకుంది.

తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే టీనేజ్ ప్రేమకథగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తెలిసి తెలియని వయసులో చేసే ప్రేమ వల్ల ఎలాంటి ఇబ్బందులు పడతారనే కోణంలో ఈ కథను రూపొందించినట్లు ట్రైలర్‌లో అర్థమవుతోంది. పాఠశాలలో మొదలైన లవ్ చివరికీ ఏమైందనేదే ఈ తెల్లకాగితం స్టోరీగా ట్రైలర్‌లో చూపించారు. ఒక్క చిన్న తప్పు.. తెల్లటి కాగితం లాంటి మీ జీవితాన్ని నాశనం చేస్తుంది అనే డైలాగ్‌ కథపై ఆసక్తిని పెంచుతోంది. కాగా.. ఈ చిత్రానికి విజయ్‌ బుల్గానిన్‌ సంగీమందించారు. ఈ మూవీ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement