'ది ‍ప్యారడైజ్‌లో సుబ్బు రోల్.. మీ మైండ్‌ బ్లాంకే' | Actress Kayadu Lohar Reveals Her role In Nani The Paradise Movie | Sakshi
Sakshi News home page

Kayadu Lohar: 'ది ‍ప్యారడైజ్‌లో నా రోల్.. అన్నీ సర్‌ప్రైజ్‌లే'

Sep 22 2026 5:56 PM | Updated on Sep 22 2026 5:56 PM

Actress Kayadu Lohar Reveals Her role In Nani The Paradise Movie

నాని హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ యాక్షన్‌ మూవీ ది ప్యారడైజ్. ఈ చిత్రానికి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ మూవీ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈనెల 23న సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలతో జడల్ జమానా షురూ కానుంది. ఈ సినిమా కోసం నాని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా కనిపించనుంది.

ఈ సందర్భంగా ది ప్యారడైజ్ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది కయాదు బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ తన రోల్‌ గురించి ప్రస్తావించింది. తన పాత్రకు సంబంధించి చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయని తెలిపింది. అవీ చూశాక ప్రేక్షకుల మైండ్ బ్లాంక్‌ అవ్వడం ఖాయమని చెప్పింది. డ్రాగన్ మూవీ చూశాకే నన్ను శ్రీకాంత్ ఎంపిక చేశారని తెలిపింది. తన సుబ్బు పాత్రకు సంబంధించిన సర్‌ప్రైజ్‌లు తెరపై చూస్తేనే ఆనందిస్తారని చెప్పుకొచ్చింది. ఇది తన కెరీర్‌లోనే చాలా పెద్ద ప్రాజెక్ట్ అని కయాదు లోహర్ రివీల్ చేసింది. 

కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్ లేకుండానే ది ప్యారడైజ్ మూవీని రిలీజ్‌ చేయడం విశేషం. ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేస్తున్నాయి. థియేటర్లలోనూ పూనకాలు తెప్పించేలా పాటలు ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement