నా ఫ్రెండ్ చేతిలో దారుణంగా మోసపోయా: తమన్ | Tollywood Music Director SS Thaman Shares His Friend Fraud | Sakshi
Sakshi News home page

SS Thaman: 'ఫ్రెండ్ చేతిలో దారుణంగా మోసపోయా'

Sep 22 2026 8:10 PM | Updated on Sep 22 2026 8:24 PM

Tollywood Music Director SS Thaman Shares His Friend Fraud

టాలీవుడ్ మ్యూజిక్ స్టార్ డైరెక్టర్లలో ఎస్ఎస్ తమన్ ఒకరు. తన బీజీఎంతో అభిమానులను అలరిస్తూ ఉంటారు. ముఖ్యంగా బోయపాటి సినిమాలకు తన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో ఆడియన్స్‌కు పూనకాలు తెప్పిస్తుంటారు. తన టాలెంట్‌తో తెలుగు ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్‌ సినిమాలకు సైతం పని చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తమన్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన ఫ్రెండ్‌ చేతిలో దారుణంగా మోసపోయానని వెల్లడించారు.

తమన్ మాట్లాడుతూ..'అల్లు అర్జున్‌ సరైనోడు మూవీ తర్వాత నాకు కాస్తా గ్యాప్ వచ్చింది. ‍‍అదే సమయంలో నా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఆ టైమ్‌లోనే నేను ఒక ఫ్రెండ్‌ నమ్మి కొంత డబ్బు పెట్టుబడి పెట్టాను. చివరికీ అతను నన్ను మోసం చేశాడు. దీంతో చాలా ఇబ్బందులు పడ్డా. ఆ దెబ్బకు ఆర్థికంగా జీరోకు పడిపోయా. అప్పటిదాకా నేను సంపాదించుకున్న డబ్బులు మొత్తం పోగొట్టుకున్నా. ఆ సమయంలో నా దగ్గర బియ్యం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. కానీ అలాంటి టైమ్‌లోనే నేను పడిపోకుండా మరింత బలంగా నిలబడ్డా. ఆ పరిస్థితుల్లో మహానుభావుడు, భాగమతి, తొలిప్రేమ సినిమాల అవకాశాలు నన్ను మళ్లీ నిలబెట్టాయని' అన్నారు. కాగా..  ప్రస్తుతం తమన్.. వెంకీ- త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న ఆదర్శకుటుంబం చిత్రానికి సంగీతమందిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement