విక్టరీ వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం..AK47’ . ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లిమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 2 న రిలీజ్ చేయడానికి మేకర్స్ ముందుగానే ప్లాన్ చేశారు.
దానికి తగ్గట్లుగానే రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు సడెన్‌గా విడుదల తేదిని మార్చేశారు. తొలుత ప్రకటించిన తేదీ కంటే వారం ఆలస్యంగా, ఈ చిత్రాన్ని అక్టోబర్ 9, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ప్రేక్షకులకు సంపూర్ణ వినోదానుభూతిని అందించాలనే ఉద్దేశంతో చిత్ర విడుదలను వారం రోజుల పాటు వాయిదా వేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో వెంకటేష్ పాత్రను పరిచయం చేస్తూ.. హాస్యం, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో టీజర్ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
#AadarshaKutumbam will be taking a little more time to deliver the entertainment and experience we have promised you. The film will now release worldwide on 9th OCT ❤️
We know the wait has been a little longer than expected and we sincerely apologise for the delay 🙏
First… pic.twitter.com/ydePAw6ElS— Naga Vamsi (@vamsi84) September 22, 2026


