రణబాలి.. ఏందయ్య సామీ ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది.. | Ranabaali Endhayya Saami Full Song Released | Sakshi
Sakshi News home page

Ranabaali Movie: రణబాలి.. ఏందయ్య సామీ ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది..

Sep 22 2026 2:34 PM | Updated on Sep 22 2026 2:47 PM

Ranabaali Endhayya Saami Full Song Released

టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్‌ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్‌ 16 ఈ సినిమా విడుదల  కానుంది. ఇప్పుడికే విడుదలైన టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమి చిత్రీకరణ పూర్తిచేసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మరో అప్‌డేట్‌తో అభిమానులను ఉత్సాహపరిచింది. సినిమాలోని ఏందయ్యా సామీ ఫుల్‌ సాంగ్‌ని విడుదల చేసింది. 

కాగా  ఈ చిత్రం1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కింది. విజయ్‌ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. విజయ్‌, రష్మిక పెళ్లి తరువాత వస్తున్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి అజయ్‌, అతుల్‌ సంగీతం అందిస్తున్నారు.  టీ సిరీస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement