యువన్ కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్, మనస్విని భాగ్యరాజా సమర్పణలో కార్తీక్ భాగ్యరాజా దర్శకత్వం వహించిన సినిమా ‘డియర్ ఆస్ట్రోనాట్’. ఈ చిత్రం నుంచి గౌతమ్ మీనన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో డేవిడ్ థామస్‌గా గౌతమ్ కనిపించనున్నారు. షూటింగ్ పూర్తి అయింది. అక్టోబర్‌లో సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
‘డియర్ ఆస్ట్రోనాట్’.. అంతరిక్షంలో ప్రయాణించాలనే ఓ యువతి కథ. చిన్నప్పటి నుంచి అంతరిక్షంలోకి వెళ్లాలని, నక్షత్రాల మధ్య విహరించాలని కలలు కనే ఒక మహిళ స్టోరీతో దీనిని తెరకెక్కించారు. అసాధారణమైన కలని సాకారం చేసుకోవడానికి ఆమె సాగించే ప్రయాణాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా చూపించబోతున్నారు. ఆకాశాన్ని అందుకోవాలనే ఆమె ఆశయం వెనుక ఉన్న సవాళ్లు, పట్టుదల, ఆశ, భావోద్వేగాలను ఇందులో గొప్పగా చిత్రీకరించారు.


