పుష్ప సినిమాలతో టాలీవుడ్‌లో ఓ మార్క్ క్రియేట్ చేసిన సుకుమార్ జాతీయ అవార్డ్ అందుకున్నారు. గుజరాత్‌లోని కేవాడియాలో జరిగిన జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు. పుష్ప-2 చిత్రానికి గానూ ఉత్తమ స్క్రీన్ ప్లే(ఒరిజినల్) విభాగంలో ఈ అవార్డ్ దక్కించుకున్నారు. కమిటీ కుర్రోళ్లు చిత్రానికి గానూ నిహారిక కొణిదెల అవార్డ్ స్వీకరించారు.
ఈ అవార్డుల ప్రదానోత్సవంలో కల్కి, కమిటీ కుర్రోళ్లు, 35... చిన్న కథ కాదు, లక్కీ భాస్కర్ లాంటి తెలుగు చిత్రాలకు కూడా అవార్డులు దక్కాయి. ఉత్తమ చిత్రంగా ఆర్టికల్ 370, యామీ గౌతమ్ ఉత్తమ నటిగా అవార్డ్ అందుకుంది. ఉత్తమ నటుడి కేటగిరీలో మమ్ముట్టి (మలయాళ చిత్రం: భ్రమయుగం) కార్తీక్ ఆర్యన్ (హిందీ చిత్రం: చందు ఛాంపియన్) అవార్డులు స్వీకరించారు. ఉత్తమ దర్శకుడిగా రాజ్‌కుమార్ పెరియసామి (తమిళ చిత్రం: అమరన్), ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా రణదీప్ హూడా (హిందీ చిత్రం: స్వాతంత్య్ర వీర్ సావర్కర్), ఉత్తమ సినీ గ్రంథంగా కన్నడ పుస్తకం ‘నానిరువుడే నిమగాగి... నాడిరువుడే ననగాగి’ (రచయిత కె. ప్రదీప్ కుమార్ శెట్టి), ఉత్తమ సినీ విమర్శకుడిగా సంజీవ్ శ్రీవాస్తవ (హిందీ జర్నలిస్ట్) అవార్డులు అందుకున్నారు.
72nd National awards presentation event Red carpet #sukumar #Tabithasukumar#NationalFilmAwards pic.twitter.com/baDyDljqzc
— venubikki (@venubikki) September 22, 2026


