టాలీవుడ్ నటుడు శివాజీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప మూవీ గురించి ఆయన మాట్లాడారు. కోర్టు మూవీ హీరో నటించిన తెల్లకాగితం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన పుష్ప సినిమా గురించి కామెంట్స్ చేశారు. ఆ మూవీలో కీలక పాత్రపై ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఏ పాత్ర రాసిపెట్టి ఉంటే వాళ్లకే దక్కుతుందన్నారు.
పుష్ప చిత్రంలో సునీల్ పోషించిన రోల్ మొదట తనకే వచ్చిందని శివాజీ వెల్లడించారు. మంగళ శీను పాత్ర నేను చేయాల్సిందని తెలిపారు. కానీ మనం ఎంత అనుకున్నా.. విధి ఒకటి రాసి పెట్టి ఉంటుందని శివాజీ అన్నారు. అది సునీల్ ఖాతాలోకి వెళ్లాలని రాసిపెట్టి ఉందన్నారు. అందుకే సునీల్ మంగళం శీనుగా మిమ్మల్ని అలరించాడని తెలిపారు. ఆ క్యారెక్టర్‌లో సునీల్ అద్భుతంగా నటించారని కొనియాడారు. అలా మంగళం శ్రీను పాత్ర వెనుక ఉన్న అసలు నిజాన్ని రివీల్ చేశారు.
ఈ సందర్భంగా తెల్ల కాగితం సినిమాతో తనకున్న అనుబంధాన్ని శివాజీ గుర్తుచేసుకున్నారు. రాజమండ్రి నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ తన వద్దకు వచ్చిందన్నారు. ఈ కథ వినగానే విపరీతంగా నచ్చడంతో తానే స్వయంగా నిర్మించాలని కూడా భావించినట్లు చెప్పారు. ఒక చిన్న టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మూవీ హీరో హర్ష్ రోషన్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలవాలని కోరుకుంటున్నట్లు శివాజీ తెలిపారు.
పుష్ప సినిమాలో మంగళం శ్రీను క్యారెక్టర్ నేను చేయాల్సింది..
- #Shivaji #Thellakaagitham #HarshRoshan #Nakshatra #Tollywood #TeluguCinema #Tupaki
Follow👉@tupaki_official pic.twitter.com/6hTHPgoVp5— Tupaki (@tupaki_official) September 22, 2026


