రాత్రివేళ యాక్షన్‌ | Ram RAPO23 Second Schedule Wrapped With Massive Night Action Sequence | Sakshi
Sakshi News home page

రాత్రివేళ యాక్షన్‌

Sep 23 2026 4:17 AM | Updated on Sep 23 2026 4:17 AM

Ram RAPO23 Second Schedule Wrapped With Massive Night Action Sequence

రామ్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ‘రాపో 23’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ చిత్రంలో సంయుక్త కథానాయికగా నటిస్తున్నారు. రాపో సినిమాటిక్స్‌ బ్యానర్‌పై కృష్ణపోతినేని ఈ సైకాలజికల్‌ థ్రిల్లర్‌ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండో షెడ్యూల్‌ పూర్తయింది. ముఖ్యంగా రాత్రివేళ సాగే యాక్షన్‌ సీక్వెన్స్‌లను చిత్రీకరించారు మేకర్స్‌. ‘‘ఏకంగా ఒక కిలోమీటర్‌ మేర విస్తరించిన భారీ స్ట్రెచ్‌లో ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కించారు.

యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ కెవిన్‌ మాస్టర్‌ ఈ ఇంటెన్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను డిజైన్‌ చేయగా, నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ సినిమాటోగ్రాఫర్‌ తిరునావుక్కరసు (తిరు) ఈ ఫైట్స్‌ను చిత్రీకరించారు. దర్శకుడిగా రామ్‌పోతినేని ఊహించిన ప్రత్యేకమైన విజన్‌కు అనుగుణంగా ఈ సినిమాకు డిఫరెంట్‌ విజువల్‌ టెక్స్చర్‌ను అంది స్తన్నారు. ఈ మూవీకి స్ట్రాంగ్‌ టెక్నికల్‌ టీమ్‌ పనిచేస్తోంది. సామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తుండగా, ఏఎస్‌ ప్రకాష్‌ ప్రోడక్షన్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నారు’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement