వ్యక్తిత్వ వికాసం గురించి పుస్తకాల్లో చదివిన విషయాలకంటే.. స్వయంగా జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల నుంచి చెప్పే మాటలకు మరింత విలువ ఉంటుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, హీరో నాని తమ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను అభిమానులతో పంచుకున్నారు.
చిరంజీవి తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, దాని కోసం కష్టపడటం, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగడం వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు, అవమానాలు, ఎదురుదెబ్బలు ఎదురైనా తనపై తనకు నమ్మకాన్ని కోల్పోలేదని చెప్పారు. అనుకూల పరిస్తుతలోనే కాదు.. ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యంగా నిలబడటం నేర్చుకున్నానని వెల్లడించారు.
మరోవైపు నాని కూడా తన కెరీర్ అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. మనం ఎదుగుతున్న కొద్దీ ప్రశంసించే వారితో పాటు కిందకు లాగాలని చూసేవాళ్లు కూడా ఉంటారని చెప్పారు. పెరుగుతున్న కొద్దీ నెగెటివిటీ కూడా పెరుగుతుంది. దానిని పట్టించుకోకుండా లక్ష్యం వైపు వేగంగా ముందుకు సాగాలని సూచించారు.
ఇలా ఒకే సమయంలో చిరంజీవి, నాని తమ జీవిత అనుభవాల నుంచి నేర్చుకున్న విషయాలను అభిమానులతో పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇద్దరి మాటలు అభిమానుల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి.


