హాలివుడ్ థ్రిల్లర్ ‘ప్రొటెక్టర్’ మూవీ రివ్యూ | Protector Telugu Review: Action-Packed Hollywood Thriller Streaming on Prime | Sakshi
Sakshi News home page

OTT: హాలివుడ్ థ్రిల్లర్ ‘ప్రొటెక్టర్’ మూవీ రివ్యూ

Aug 6 2026 2:10 PM | Updated on Aug 6 2026 2:59 PM

Hollywood Movie Protector Review In Telugu

ప్రపంచంలో ప్రతి వ్యక్తికి రక్షణ అనేది కీలకం. కాని ఆ రక్షణ అనేది ఎవరి నుంచి తమకు అందుతుందనేదే ముఖ్యం. ఈ రోజుల్లో చాలా మంది మనకు రక్షణగా ఉంటుంటారు. అందులో మనకు సుదూరపు సరిహద్దుల నుంచి మనల్ని కాపాడే సైనికుడు కావచ్చు, కూతవేటు దూరంలో ఉండే పోలీసు కానిస్టేబుల్ కావచ్చు.. అంతెందుకు అనుక్షణం మన వెంట ఉండే మన స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా కావచ్చు. కాని మన ప్రాణం కోసం తన ప్రాణాన్ని అడ్డుపడుతూ మనల్ని కంటికి రెప్పలా కాపాడేది మాత్రం ఎప్పటికీ కన్నతల్లే. ఆ నేపథ్యంతో మన ముందుకు తీసుకువచ్చిన సినిమానే ప్రొటెక్టర్. 

ఇదో హాలివుడ్ థ్రిల్లర్. ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా తెలుగులోనూ లభ్యమవుతోంది. ఆద్యంతం ఈ సినిమా ప్రేక్షకుడిని ఉత్కంఠ రేపుతూ కదలనీయకుండా చేస్తుంది. అంతలా ఈ సినిమా కథలో ఏముందో ఓ సారి చూద్దాం. నిక్కీ ఓ రిటైరైన సోల్జర్. తాను డ్యూటీలో ఉన్నపుడు దాదాపు ఏళ్ళ తరబడి కన్నకూతురు క్లోయీని ఫోను ద్వారానే మాట్లాడుతూ ఉండేది. ఇప్పుడు రిటైరయ్యాక కూతురుతో ఆనందంగా గడుపుదామని అనుకుని క్లోయితో చెబుతుంది. కాని క్లోయీ నువ్వు నన్ను ఎప్పుడూ పట్టించుకోలేదని బాధపడుతూ తాను స్నేహితులతో క్లబ్ కు వెళుతున్నానని చెప్పి విసురుగా వెళిపోతుంది. 

కన్న మమకారంతో క్లోయీ క్లబ్ వైపు వెళ్ళిన నిక్కీకి అక్కడ ఓ వింత అనుభవం ఎదురవుతుంది. క్లోయీని ఎవరో దుండగులు కిడ్నాప్ చేస్తూ కనిపిస్తుంది. దాంతో నిక్కీ వాళ్ళని వెంబడిస్తూ 72 గంటల్లో ఎట్టి పరిస్థితుల్లోను తన బిడ్డను కాపాడుకోవాలని చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటుంది. మరి నిక్కీ తన కూతురు క్లోయీని వెతికి పట్టుకుంటుందా లేదా అన్నది మాత్రం ప్రొటెక్టర్ సినిమాలోనే చూడాలి. 

పైన చెప్పుకున్నట్టు ఈ సినిమా మంచి థ్రిల్లర్. మరీ ముఖ్యంగా సినిమాలో వచ్చే ఆఖరి ట్విస్టు మాత్రం ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేస్తుందనే విషయం నిస్సందేహంగా చెప్పవచ్చు. మస్ట్ వాచ్ ఫర్ ది థ్రిల్లింగ్ వ్యూవర్స్.
– ఇంటూరు హరికృష్ణ   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement