8 ఏళ్లు కష్టపడ్డా.. చెంపపై పదే పదే కొట్టుకున్న నటుడు | Actor Bhanu Slapped On His Own Cheek At Hushar Pittalu Movie Press Meet, Watch Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

నమ్మలేకపోతున్నానంటూ.. చెంపపై పదే పదే కొట్టుకున్న నటుడు

Aug 6 2026 9:52 AM | Updated on Aug 6 2026 10:23 AM

Actor Bhanu Slapped On His Own Cheek At Hushar Pittalu Movie Press Meet

సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంత ఈజీ కాదు. కొందరికి త్వరగా అవకాశాలు వస్తే..మరికొందరికి ఏళ్లు పడతాయి. అయినా కూడా ఫ్యాషన్‌తో కొంతమంది చిత్రపరిశ్రమను వదిలిపెట్టి రారు. తమ టాలెంట్‌ని నిరూపించుకునేందుకు ఒక్క చాన్స్‌ వచ్చినా చాలు అంటూ ఆశగా ఎదురు చూస్తుంటారు. అలా ఓ నటుడికి 8 ఏళ్ల తర్వాత బిగ్‌స్క్రీన్‌పై చూసుకునే అవకాశం వచ్చింది. తన కల నిజం కావడంతో.. స్టేజ్‌పైనే భావోద్వేగానికి లోనయ్యాడు.  

అన్షు, వాసవి గణేశన్‌ జంటగా నటించిన తాజా చిత్రం ‘హుషార్‌ పిట్టలు’.  ఇందులో భాను అనే నటుడు కీలక పాత్ర పోషించాడు. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా భాను మాట్లాడుతూ.. ఎమోషనల్‌ అయ్యాడు. 

‘సినిమాల్లో రావడానికి 8 ఏళ్లు కష్టపడ్డా. ఎంతమంది హేళన చేసిన భరించా. స్క్రీన్‌ మీద నన్ను నేను చూసుకొని నమ్మలేకపోతున్నా. నేను అంత పెద్ద స్క్రీన్‌మీద ఉన్నానా.. ఇది కలనా, నిజమా’ అంటూ చెంపపై పదేపదే కొట్టుకున్నాడు. దీంతో స్టేజ్‌ మీద ఉన్నవాళ్లంతా షాక్‌ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. హుషారు పిట్టలు సినిమా ఆగస్ట్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement