breaking news
Hushar Pittalu Movie
-
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా
కొన్నిసార్లు చిన్న సినిమాలు ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి హిట్ అయిపోతుంటాయి. అలాంటి ఓ తెలుగు చిత్రం 'హుషార్ పిట్టలు'. టీనేజీ రొమాంటిక్ కామెడీ మూవీగా దీన్ని తీశారు. థియేటర్లలోకి వచ్చినప్పుడు అదరగొట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడాలి?(ఇదీ చదవండి: 'రంగస్థలం' కోసం చరణ్ అన్నని బాగా టార్చర్ చేశా: శ్రీకాంత్ ఓదెల)వాసవి గణేశన్, అన్ష్ ప్రధాన పాత్రలు చేసిన రొమాంటిక్ కామెడీ సినిమా 'హుషార్ పిట్టలు'. ప్రోమోలతో వైరల్ అయిన ఈ చిత్రం గత నెల అంటే ఆగస్టు 15న పెద్దగా ప్రచారం లేకుండానే థియేటర్లలో రిలీజైంది. డబుల్ మీనింగ్ జోకులతో పాటు చివరలో యువతకు ఓ మెసేజ్ ఇచ్చేసరికి ప్రేక్షకులు బాగానే ఆదరించారు. పెట్టిన బడ్జెట్‌కి మించి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడీ మూవీ సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది.'హుషార్ పిట్టలు' విషయానికొస్తే.. రవి(అన్ష్) పదో క్లాస్‌లో మంచి మార్కులతో పాస్ అవుతాడు. కానీ ఊరిలో కుర్రాళ్ల వల్ల చెడు ఆలోచనలు వస్తాయి. ఈ క్రమంలోనే తన ఊరిలోనే ఉండే చిట్టి(వాసవి గణేశన్)తో ప్రేమలో పడతాడు. టీనేజీ వయసులోనే వీళ్లిద్దరూ ఉన్నప్పటికీ ముద్దులు, హద్దులు దాటేస్తారు. ఓరోజు ఇలాంటి స్థితిలో ఉండగానే తల్లిదండ్రులకు పట్టుబడతారు. తర్వాత ఏం జరిగింది? చిట్టి, రవి చివరకు ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ.యుక్త వయసులో యువత చెడిపోవడానికి కారణాలేంటి? తల్లిదండ్రులు, అక్కలు, అన్నలు లాంటి పెద్దోళ్ల నుంచి స్నేహితుల వల్ల టీనేజీ పిల్లలు ఎలా చెడిపోతున్నారు? అనే అంశాల్ని ఇందులో చూపించారు. కాకపోతే మూవీ అంతా అడల్ట్ కామెడీ చూపించి చివరలో మెసేజ్ ఇవ్వడం కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
సమయానికి విలువ ఇస్తుంది: డి.సురేష్ బాబు
‘‘నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ద్వారా ‘హుషార్ పిట్టలు’ సినిమా గురించి తెలిసింది. మా సురేష్ ప్రోడక్షన్స్ ప్రతినిధులు ఈ మూవీ చూసి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంతో సురేష్ ఏషియన్ ఫిలింస్ ద్వారా విడుదల చేస్తున్నాం. ప్రేక్షకుల డబ్బు, సమయానికి విలువ ఇచ్చే చిత్రం ఇది’’ అని నిర్మాత డి.సురేష్‌బాబు తెలిపారు. అన్షు, వాసవి గణేషన్ జంటగా నటీంచిన చిత్రం ‘హుషార్ పిట్టలు’.బిక్షు దర్శకత్వంలో పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఈ నెల 15న విడుదల చేస్తున్నాయి. సోమవారం నిర్వహించిన ‘హుషార్ పిట్టలు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి డి.సురేష్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై, ట్రైలర్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా డైరెక్టర్ బిక్షు మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో వాణిజ్య అంశాలతో పాటు ఓ సందేశం కూడా ఉంది’’ అని చెప్పారు. ‘‘ఇలాంటి మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని వాసవీ గణేషన్ , అన్షు, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కెం వేణుగోపాల్, కెమెరామెన్ రుద్రసాయి, నటులు గోవర్థన్ , భాను, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
'హుషారు పిట్టలు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
క్లైమాక్స్ హృదయాన్ని హత్తుకుంటుంది: నిర్మాత బెక్కెం వేణుగోపాల్
అన్షు, వాసవి గణేషన్ జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ సినిమా ‘హుషారు పిట్టలు’. బిక్షు దర్శకత్వంలో పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌పై వెంకట్ యాదవ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ సంస్థలు ఈ నెల 15న విడుదల చేస్తున్నాయి. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన సమావేశంలో ‘టోంగా టోంగా’, ‘ శుక్రవారం నాడు సక్కని గడియ’ పాటలను రిలీజ్ చేశారు.అనంతరం హీరో అన్షు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా విషయంలో మాకు అంతా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘దర్శకుడిని కావాలన్న నా ఆకాంక్ష ఈ సినిమాతో నెరవేరింది. ఈ నెల 10న మా సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నాం. ట్రైలర్ చూసిన తర్వాత మా సినిమాపై ఉన్న అబీప్రాయాలు మారిపోతాయి’’ అని చెప్పారు. ‘‘ఇటీవల విడుదలైన మా సినిమా టీజర్‌కు ప్రశంసలు వచ్చాయి... విమర్శలూ వచ్చాయి. కానీ టీజర్ వైరల్ అయ్యి, హిట్ అయ్యింది. ప్రేక్షకులు మా సినిమాను చూస్తే, వారి డబ్బులకు తగిన ఫలితం ఉందని సంతృప్తి చెందుతారని చెప్పగలను’’ అన్నారు వెంకట్ యాదవ్.‘‘ఈ సినిమా కేవలం యూత్‌కే కాదు... మంచి సందేశం ఉన్న కమర్షియల్ చిత్రం. నిర్మాత సురేష్‌బాబుగారు చూసి, నచ్చి, ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి’’ అని చెప్పారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. ‘‘హిట్ సినిమా లేకపోతే ఇండస్ట్రీ గుర్తించదు. నాకు ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ వస్తుందని అనుకుంటున్నాను’’ అని తెలిపారు సంగీత దర్శకుడు చరణ్ అర్జున్. వాసవి గణేషన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత చిరంజీన్, డీవోపీ రుద్రసాయి, నటులు గోవర్థన్, భాను, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
8 ఏళ్లు కష్టపడ్డా.. చెంపపై పదే పదే కొట్టుకున్న నటుడు
సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంత ఈజీ కాదు. కొందరికి త్వరగా అవకాశాలు వస్తే..మరికొందరికి ఏళ్లు పడతాయి. అయినా కూడా ఫ్యాషన్‌తో కొంతమంది చిత్రపరిశ్రమను వదిలిపెట్టి రారు. తమ టాలెంట్‌ని నిరూపించుకునేందుకు ఒక్క చాన్స్ వచ్చినా చాలు అంటూ ఆశగా ఎదురు చూస్తుంటారు. అలా ఓ నటుడికి 8 ఏళ్ల తర్వాత బిగ్స్క్రీన్పై చూసుకునే అవకాశం వచ్చింది. తన కల నిజం కావడంతో.. స్టేజ్‌పైనే భావోద్వేగానికి లోనయ్యాడు. అన్షు, వాసవి గణేశన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘హుషార్ పిట్టలు’. ఇందులో భాను అనే నటుడు కీలక పాత్ర పోషించాడు. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా భాను మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యాడు. ‘సినిమాల్లో రావడానికి 8 ఏళ్లు కష్టపడ్డా. ఎంతమంది హేళన చేసిన భరించా. స్క్రీన్ మీద నన్ను నేను చూసుకొని నమ్మలేకపోతున్నా. నేను అంత పెద్ద స్క్రీన్‌మీద ఉన్నానా.. ఇది కలనా, నిజమా’ అంటూ చెంపపై పదేపదే కొట్టుకున్నాడు. దీంతో స్టేజ్ మీద ఉన్నవాళ్లంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


