నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశాన్నంటాయి.. ట్రైలర్‌లో తమ తమ పాత్రలతో హత్తుకున్న రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్‌తో పాటుగా మరో ముఖం కూడా ప్రేక్షకుల దుష్టిని ఆకర్షించింది. ఆమెనే రియా కపూర్ . సీత పక్కన సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఈ నటి ఎవరని తెలుసుకోడానికి సోషల్ మీడియాకు పనిచెప్తున్నారు సినీ ప్రియులు. మరి ఆమె ఎవరో ఒకసారి చూద్దామా..?
రియా కపూర్ ఎవరంటే..
టెలివిజన్, ప్రాంతీయ సినిమాలు, మ్యూజిక్ విడియోల ద్వారా నటిగా గుర్తింపు పొందింది రియా కపూర్. ఈమె గతంలో సంపూర్ణ అనే సీరియల్‌లో నటించి బుల్లితెరలో, మిస్టేరియస్ అనే తెలుగు చిత్రంలో కనువిందు చేసింది. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంతో పలు మార్లు ఆడిషన్స్ ,లుక్ టెస్ట్‌లను పూర్తి చేసిన తర్వాత ఈ భారీ బడ్జేట్ సినిమాలో మాండవి పాత్రకు ఎంపిక చేశారట.
హిందూ పురాణాల ప్రకారం.. మాండవి కుశధ్వజ మహారాజు, చంద్రభాగ రాణిల కుమార్తె. సీతకు మేనకోడలు ( కజిన్) అవుతుంది. అనంతరం శ్రీరాముడి తమ్ముడు భరతుడిని వివాహం చేసుకుని అయెధ్య లో కీలక సభ్యురాలిగా మారుతుందట. ఇటీవల రిలీజైన రామాయణ ట్రైలర్‌లో రెప్పపాటు కాలం పాటు కనిపించినప్పటికీ రెండు భాగాల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె పాత్రకు ప్రాధాన్యం ఉండనుందని తెలుస్తోంది. కాగా చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా వెండి తెరను పలకరించనున్నారు. సన్నీ డియోల్, రవి దూబే, అరుణ్ గోవిల్ , రకుల్ ప్రీత్ సింగ్ వంటి నటులు కూడా ఉన్నారు.


