నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్'. ఈ సినిమాకు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మార్చిలోనే రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ.. షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడంతో ఆగస్టుకి వాయిదా వేశారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్ దక్కించుకున్నాయి.
తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే కథ ఫుల్ వయొలెంట్‌గా ఉండనుందని అర్థమవుతోంది. యాక్షన్‌లో సీన్స్‌లో ఎక్కడా చూసినా రక్తపాతమే కనిపిస్తోంది. ఈ ఫుల్ వయొలెంట్ టీజర్ టాలీవుడ్ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ మూవీ మోహన్‌బాబు పాత్ర హైలెట్‌గా ఉండనుందని టీజర్‌లో తెలిసిపోతోంది. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీలో తనికెళ్ల భరణి, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తోన్న ఈ మూవీ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


