breaking news
Pyaar Prema Kalyanam Movie
-
ఓటీటీ సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం' తెలుగు రివ్యూ
అప్పుడప్పుడు ఓటీటీలో నేరుగా కొన్ని సినిమాల్ని రిలీజ్ చేస్తుంటారు. అలా తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లోకి 'ప్యార్ ప్రేమ కళ్యాణం' వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కథతో తీశారు. తమిళ కుర్రాడు ఎలన్ హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. తెలుగమ్మాయి శాన్వి మేఘన హీరోయిన్గా చేసింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?దుబాయిలో సివిల్ ఇంజినీర్‌గా పనిచేసే ఎలన్(ఎలన్) ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చెప్పి తనకు తానుగానే ఉద్యోగం మానేసి ఇంటికొచ్చేస్తాడు. అనుకోని పరిస్థితుల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ పవిత్ర అలియాస్ పర్పుల్ పవి(శాన్వి మేఘన)తో ప్రేమలో పడతాడు. పెద్దల్ని ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంటాడు. కానీ పవి సొంతింటిని వదిలేసి రానని పట్టుబడుతుంది. దీంతో ఎలన్.. ఇల్లరికపు అల్లుడిగా అత్తారింట్లో అడుగుపెడతాడు. తర్వాత ఇతడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?'ప్యార్ ప్రేమ కళ్యాణం'.. టైటిల్‌కి తగ్గట్లే ప్రేమ, పెళ్లి బంధంలోని ప్లస్ మైనస్సుల గురించి ఇందులో చూపించారు. మరి సినిమా ఎలా ఉంది అని అడిగితే ఓకే అంతే. చెబుదామనుకున్న పాయింట్ బాగున్నప్పటికీ విపరీతమైన తమిళ అతి ప్రతి సీన్లోనూ కనిపిస్తూ ఉంటుంది. హీరోయిన్ పాత్ర తప్పితే ప్రతి ఒక్కరూ చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తుంటారు. ఇదంతా కామెడీ అనుకుని దర్శకుడు అనుకున్నాడు. కానీ కుదరలేదు. తమిళ ప్రేక్షకులకు నచ్చొచ్చేమో గానీ నాకైతే పెద్దగా నవ్వు రాలేదు.సంప్రదాయం ప్రకారం పెళ్లి తర్వాత అమ్మాయిలు అత్తారింటికి వెళ్తారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం అల్లుడు, అత్తారింటికి(ఇల్లరికం) వస్తాడు. ఈ సినిమాలో అలానే ఉద్యోగం లేని హీరో.. ఇల్లరికపు అల్లుడిలా వెళ్తాడు. ప్రారంభంలో మర్యాదలు ఓ రేంజులో ఉంటాయి. కానీ రానురాను మురిపెం తగ్గిపోయి అత్త అసలు రంగు బయటపడుతుంది. అప్పటినుంచి అల్లుడికి బ్యాండ్ బాజా బరాత్ మొదలవుతుంది. దీంతో కష్టాలు పడతాడు. ఈ పార్ట్ అంతా కూడా ఓకే ఓకే అనేలా ఉంటుంది. టైమ్ పాస్ అయిపోతుంది.చాలామంది గృహిణులు.. భర్త బయటకెళ్లి ఉద్యోగం చేస్తూంటే ఇంటిని చూసుకుంటూ ఉంటారు. ఈ సినిమా ఇదే రివర్స్‌లో జరుగుతుంది. ఓ సందర్భంలో హీరోకి జాబ్ వస్తే ఆ సంగతి హీరోయిన్‌కి చెబుతాడు. ఆమె ఏమో.. నువ్వు బయటకెళ్లి పనిచేయడం ఎందుకు, ఇంట్లో కంఫర్ట్‌బుల్‌గానే ఉన్నావ్‌గా, పైగా జీతం కూడా తక్కువే అని అతడిని నిరుత్సాహపరుస్తుంది. ఈ సీన్ చూస్తున్నప్పుడు ఏళ్లకేళ్లుగా చాలామంది భర్తలు.. ఉద్యోగం చేయాలనుకునే భార్యలకు ఇలానే చెబుతుంటారు కదా అనిపించింది. చాలామంది గృహిణులు ఇలా భర్తలు చెప్పే మాటల వల్ల ఎంతలా నిరుత్సాహపడుతున్నారనేది బాగా చూపించారు.అలానే ఫెమినిస్ట్ అని చెప్పుకొనే హీరోయిన్.. తాను సొంతింటిని, తల్లిదండ్రులని వదిలిరానని చెప్పి భర్తని తన ఇంటికి ఇల్లరికం రప్పించుకుంటుంది. తర్వాత ఈ విషయంలో ఆమె రియలైజ్ అయ్యే సీన్ ఉంటుంది. దీనిని బాగానే తీశారు. ఫస్టాప్‌లో హీరో, అతడి అత్త, భార్య మధ్యలో వచ్చే హంగామా, సెకండాఫ్‌లో హీరో తల్లి చేసే దొంగపనులు వల్ల హీరోయిన్ జాబ్ కోల్పోవడం లాంటివి పర్లేదనిపించాయి. క్లైమాక్స్ అయితే నిజంగా ఎక్కడైనా అలా జరుగుతుందా అని డౌట్ వస్తుంది. అదంతా సినిమాటిక్‌గా అనిపిస్తుంది.యాక్టింగ్ విషయానికొస్తే.. పవిత్రగా శాన్వి మేఘన పాత్రకు తగ్గట్లు చేసింది. హీరో కమ్ దర్శకుడు ఎలన్ కూడా బాగానే చేశాడు. కాకపోతే తన తమిళ ప్రేక్షకులకు నచ్చుతుందనో ఏమో గానీ మొత్తం అతితో నింపేశాడు. రాధిక, యోగిబాబు లాంటి సీనియర్ యాక్టర్స్ ఉన్నప్పటికీ వాళ్లని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. వాళ్లకు సరైన సీన్స్ పడలేదు. మిగతా నటీనటులు ఓకే ఓకే. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉన్నప్పటికీ మ్యూజిక్ ఏమంత గొప్పగా లేదు. నిడివి రెండు గంటలే కావడం కాస్త రిలీఫ్. ఓవరాల్‌గా చూసుకుంటే ఇదో యావరేజ్ సినిమా. అసభ్యకర సీన్స్ లేవు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.- చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో రవితేజ హీరోగా నటించిన 'ఇరుముడి' రిలీజ్ కానుంది. దీనిపై ప్రస్తుతానికి బజ్ అయితే బాగానే ఉంది. తండ్రి కూతురు నేపథ్యానికి అయ్యప్ప స్వామి మాల, 41 రోజుల దీక్ష అనే పాయింట్ జోడించి దీన్ని తెరకెక్కించారు. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి? దీనితో పాటు అమీర్ లోగ్, ద రెడ్ బ్యాగ్ అనే చిత్రాలు కూడా రాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)మరోవైపు ఓటీటీల్లో 19 వరకు కొత్త మూవీస్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో దళపతి విజయ్ 'జన నాయగన్', కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ', ప్యార్ ప్రేమ కల్యాణం అనే సినిమాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటికి తోడుగా వెల్కమ్ టూ ద జంగిల్, టాయ్ స్టోరీ 5 లాంటివి కూడా చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ చిత్రం స్ట్రీమింగ్ కానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 17 నుంచి 23 వరకు)జీ5జన నాయగన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 21ద గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో (హిందీ మూవీ) - ఆగస్టు 21నెట్ఫ్లిక్స్ఫ్రీ ఫాల్: ఏ రెకనింగ్ ఫర్ బోయింగ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 19హియర్ ద హోల్ టైమ్ (బ్రెజిలియన్ సినిమా) - ఆగస్టు 19ఔటర్ బ్యాంక్స్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 20బ్లడ్ సాక్రిఫైస్ (స్వీడిష్ సిరీస్) - ఆగస్టు 20ఎస్&ఎక్స్ (జపనీస్ సిరీస్) - ఆగస్టు 20ప్యార్ ప్రేమ కళ్యాణం (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 21ఫేసింగ్ ఎల్ చాపో (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 21హాట్స్టార్లాంటర్న్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 17 (స్ట్రీమింగ్ అవుతోంది)వెల్కమ్ టూ ద జంగిల్ (హిందీ సినిమా) - ఆగస్టు 21సోనీ లివ్చెన్నై లవ్ స్టోరీ (తెలుగు సినిమా) - ఆగస్టు 21అమెజాన్ ప్రైమ్టాయ్ స్టోరీ 5 (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 18 (రెంట్‌తో స్ట్రీమింగ్)నోవాక్ జకోవిచ్: ద వోల్ఫ్ ఇన్ వింటర్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 20క్లీనప్ కంపెనీ (హిందీ సిరీస్) - ఆగస్టు 21ఆపిల్ టీవీ ప్లస్ద డైనస్టీ: యూకాన్ హస్కీస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 20లయన్స్ గేట్ ప్లేస్నేక్స్ 5 (చైనీస్ మూవీ) - ఆగస్టు 21మాంచెస్టర్ సిటీ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 21స్టిల్ వాటర్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 21(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ) -
'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
నేరుగా ఓటీటీలోకి కామెడీ సినిమా.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు మాత్రం నేరుగా వీటిలోనే రిలీజ్ చేస్తుంటారు. అలా ఓ క్రేజీ లవ్ స్టోరీ కామెడీ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేసి చిత్రం ఎలా ఉండబోతుందో చెప్పేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎప్పుడు ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)ఎలన్ హీరో కమ్ దర్శకుడిగా చేసిన తమిళ సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం'. తెలుగమ్మాయి శాన్వి మేఘన హీరోయిన్. రాధిక కీలక పాత్ర చేసింది. దీనిని వచ్చే శుక్రవారం(ఆగస్టు 21) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.'ప్యార్ ప్రేమ కళ్యాణం' విషయానికొస్తే.. ఓ అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకుంటారు. సాధారణంగా వివాహం తర్వాత అమ్మాయి అత్తగారింటికి వెళ్తుంది. కానీ ఇక్కడ అమ్మాయి, తన భర్తని ఇల్లరికం రమ్మని అడుగుతుంది. భార్యనే కదా అని అంగీకరిస్తాడు. అక్కడ నుంచి కష్టాలు మొదలు. మరి ఈ అబ్బాయి.. అత్తారింట్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ. సీరియస్ విషయమే అయినప్పటికీ కామెడీగా దీనిని చూపించబోతున్నారని ట్రైలర్ బట్టి అర్థమవుతుంది.(ఇదీ చదవండి: హీరో సూర్య ముందు అద్భుతమైన అవకాశం) -
నేరుగా ఓటీటీలోకి లవ్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. అంటే చాలావరకు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నప్పటికీ కొన్ని మాత్రం నేరుగా స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా అలానే ఓ మూవీకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ తేదీని ప్రకటించారు. తెలుగమ్మాయి శాన్వి మేఘన హీరోయిన్గా చేసిన చిత్రమిది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి ఎప్పుడు రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలో క్రైమ్ కామెడీ సినిమా 'కాన్ సిటీ' తెలుగు రివ్యూ)తమిళ నటుడు ఎలన్.. హీరోగా పరిచయమవుతూ దర్శకుడిగా మారి తీసిన సినిమా 'ప్యార్ ప్రేమ కళ్యాణం', తెలుగమ్మాయి శాన్వి మేఘన హీరోయిన్. గతేడాది ఈ మూవీ గురించి న్యూస్ వచ్చింది. ఇప్పుడు దీన్ని వచ్చే నెల 21న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఇది అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.'ప్యార్ ప్రేమ కళ్యాణం' విషయానికొస్తే.. పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లకుండా తన ఇంట్లోనే ఉండాలని ఓ అమ్మాయి(శాన్వి మేఘన) నిర్ణయించుకుంటుంది. దీంతో ఆమె భర్త (ఎలన్) ఇల్లరికం రావాల్సి వస్తుంది. ఈ కారణంగా ఇరు కుటుంబాల్లో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరకు తమ జీవితాన్ని తాము ఎలా మలుచుకోవాలనే విషయాన్ని ఈ జంట ఎలా తెలుసుకుంటుంది? అనేదే స్టోరీలా అనిపిస్తుంది.ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, యోగి బాబు, ఎం.ఎస్. భాస్కర్, గీతా కైలాసం తదితరులు కీలక పాత్రలు చేశారు. యువన్ శంకర్ రాజా సంగీతమందించాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)Indha maari oru save the date ah neenga paathrukave maateenga 🤭🤣 pic.twitter.com/XLS3oR38Nd— Netflix India South (@Netflix_INSouth) July 27, 2026


