ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్ | Here's The List Of 15 New Movies And Web Series Releasing In OTT In July First Week 2026 | Sakshi
Sakshi News home page

OTT Releases This Week: ఓటీటీల్లో ఈ వారం 15 మూవీస్.. మరి థియేటర్లలో?

Jun 29 2026 9:12 AM | Updated on Jun 30 2026 3:10 PM

Upcoming OTT Movies Telugu July First Week 2026

మరో వారం వచ్చేసింది. ఈ వీకెండ్ థియేటర్లలోకి నాగబంధం, రావు బహదూర్ అనే తెలుగు సినిమాలు రాబోతున్నాయి. ఇవి రెండు కూడా కంటెంట్ పరంగా కాస్త డిఫరెంట్‌గా ఉండబోతున్నాయనే ఆసక్తి కలిగిస్తున్నాయి. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నారు. మరోవైపు ఆలియా భట్ ప్రధాన పాత్ర చేసిన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' కూడా ఇదే వారాంతం రిలీజ్ కానుంది. మరి దీని తెలుగు వెర్షన్ విడుదల చేస్తారా అనేది క్లారిటీ లేదు.

(ఇదీ చదవండి: 'బాహుబలి ద టార్చ్ బేరర్' రివ్యూ.. 123 నిమిషాలు గూస్ బంప్స్)

మరోవైపు ఓటీటీల్లో మాత్రం 15కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో చూడదగ్గవి చాలానే ఉన్నాయండోయ్. సందీప్ కిషన్  'సూపర్ సుబ్బ', ఐశ్వర్య రాజేశ్ 'ఇసకపట్నం' లాంటి తెలుగు సిరీస్‌లతో పాటు లేటెస్ట్ వరల్డ్ వైడ్ సెన్సేషన్ 'అబ్సెషన్' మూవీ ఇదే వారం రానుంది. మాలీవుడ్ టైమ్స్ లాంటి డబ్బింగ్ చిత్రం కూడా స్ట్రీమింగ్ కానుంది. రామ్ చరణ్ 'పెద్ది' కూడా ఈ వారం డిజిటల్ రిలీజ్ అంటున్నారు. కాకపోతే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ అందుబాటులోకి రానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూన్ 29 నుంచి జూలై 05 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • సూపర్ సుబ్బు (తెలుగు సిరీస్) - జూలై 02

  • పెద్ది (తెలుగు సినిమా) - జూలై 02 (రూమర్ డేట్)

  • ఎనోలా హోమ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 02

  • హ్యుమన్ వెపర్ (జపనీస్ సిరీస్) - జూలై 02

  • స్పార్క్స్ ఆఫ్ టొమారో (జపనీస్ సిరీస్) - జూలై 05

అమెజాన్ ప్రైమ్

  • అబ్సెషన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 30 (రెంట్)

  • ఎల్లే (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 01

  • ఇసకపట్నం (తెలుగు సిరీస్) - జూలై 02

హాట్‌స్టార్

  • మాలీవుడ్ టైమ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 03

  • ప్రీతమ్ అండ్ పెడ్రో (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 03

జీ5

  • మర్మదేశం (తెలుగు సిరీస్) - జూలై 03

  • ముతస్సీ (మలయాళ సిరీస్) - జూలై 03

సన్ నెక్స్ట్

  • హ్యాంగ్ మ్యాన్ (తెలుగు సినిమా) - జూలై 03

ఆహా

  • టాప్ తెలుగు ఇన్ఫ్లూయెన్సర్ (రియాలిటీ షో) - జూలై 03s

ఆపిల్ టీవీ ప్లస్

  • సిలో సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 03

(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. గొర్రెలు డిటెక్టివ్స్ అయితే? తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement