breaking news
Isakapatnam Series
-
ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈ వీకెండ్ థియేటర్లలోకి నాగబంధం, రావు బహదూర్ అనే తెలుగు సినిమాలు రాబోతున్నాయి. ఇవి రెండు కూడా కంటెంట్ పరంగా కాస్త డిఫరెంట్‌గా ఉండబోతున్నాయనే ఆసక్తి కలిగిస్తున్నాయి. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నారు. మరోవైపు ఆలియా భట్ ప్రధాన పాత్ర చేసిన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' కూడా ఇదే వారాంతం రిలీజ్ కానుంది. మరి దీని తెలుగు వెర్షన్ విడుదల చేస్తారా అనేది క్లారిటీ లేదు.(ఇదీ చదవండి: 'బాహుబలి ద టార్చ్ బేరర్' రివ్యూ.. 123 నిమిషాలు గూస్ బంప్స్)మరోవైపు ఓటీటీల్లో మాత్రం 15కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో చూడదగ్గవి చాలానే ఉన్నాయండోయ్. సందీప్ కిషన్ 'సూపర్ సుబ్బ', ఐశ్వర్య రాజేశ్ 'ఇసకపట్నం' లాంటి తెలుగు సిరీస్‌లతో పాటు లేటెస్ట్ వరల్డ్ వైడ్ సెన్సేషన్ 'అబ్సెషన్' మూవీ ఇదే వారం రానుంది. మాలీవుడ్ టైమ్స్ లాంటి డబ్బింగ్ చిత్రం కూడా స్ట్రీమింగ్ కానుంది. రామ్ చరణ్ 'పెద్ది' కూడా ఈ వారం డిజిటల్ రిలీజ్ అంటున్నారు. కాకపోతే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ అందుబాటులోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూన్ 29 నుంచి జూలై 05 వరకు)నెట్ఫ్లిక్స్సూపర్ సుబ్బు (తెలుగు సిరీస్) - జూలై 02పెద్ది (తెలుగు సినిమా) - జూలై 02 (రూమర్ డేట్)ఎనోలా హోమ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 02హ్యుమన్ వెపర్ (జపనీస్ సిరీస్) - జూలై 02స్పార్క్స్ ఆఫ్ టొమారో (జపనీస్ సిరీస్) - జూలై 05అమెజాన్ ప్రైమ్అబ్సెషన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 30 (రెంట్)ఎల్లే (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 01ఇసకపట్నం (తెలుగు సిరీస్) - జూలై 02హాట్స్టార్మాలీవుడ్ టైమ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 03ప్రీతమ్ అండ్ పెడ్రో (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 03జీ5మర్మదేశం (తెలుగు సిరీస్) - జూలై 03ముతస్సీ (మలయాళ సిరీస్) - జూలై 03సన్ నెక్స్ట్హ్యాంగ్ మ్యాన్ (తెలుగు సినిమా) - జూలై 03ఆహాటాప్ తెలుగు ఇన్ఫ్లూయెన్సర్ (రియాలిటీ షో) - జూలై 03sఆపిల్ టీవీ ప్లస్సిలో సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 03(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. గొర్రెలు డిటెక్టివ్స్ అయితే? తెలుగు రివ్యూ) -
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్.. 'ఇసకపట్నం' కొత్త ట్రైలర్
సముద్రఖని, ఐశ్వర్య రాజేశ్, సునీల్ ప్రధాన పాత్రల్లో చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'ఇసకపట్నం'. వచ్చే నెల 02న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది. కొన్నిరోజుల క్రితం ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు మరో ట్రైలర్‌ని విడుదల చేశారు. కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంగా అధికారం, రాజకీయాలు, గ్యాంగ్ వార్స్, కుటుంబ విభేదాలు తదితర అంశాలతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. తండ్రి-కూతురు మధ్య జరిగే పోరు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.(ఇదీ చదవండి: వెంకటేశ్ 'ఆదర్శ కుటుంబం' ఇదే)పట్టణంలో రాజకీయాలు, నేరాలు, వ్యాపారాలపై పూర్తి ఆధిపత్యం చెలాయించే నాయుడికి, తన సొంత కూతురే పెద్ద సవాలుగా మారుతుంది. తన జీవితాన్ని తన నిర్ణయాలతో ముందుకు తీసుకెళ్లాలనుకునే భారతి, తండ్రికి ఎదురు నిలబడటమే స్టోరీ. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 7 ఎపిసోడ్లతో తీశారు. జూలై 2 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే 15 భాషల్లో సబ్‌టైటిల్స్‌తో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కు పైగా దేశాలు, ప్రాంతాల్లో అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: స్టార్ హీరోతో 'సేవ్ ది టైగర్స్' సీజన్ 4) -
‘ఇసాకపట్నం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)
-
కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాను: సునీల్
‘‘ఇసాకపట్నం’ సిరీస్ చాలా వాస్తవంగా ఉంటుంది. ప్రతి పాత్రకు వారి సొంత లక్ష్యాలు, సంఘర్షణలు ఉంటాయి. ఈ సిరీస్‌లో నేను ఇప్పటి వరకు చేయని కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాను’’ అని సునీల్ పేర్కొన్నారు. ఐశ్వర్యా రాజేష్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో, సునీల్, నరేష్ అగస్త్య, రాజీవ్ కనకాల, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమాకుల ఇతర పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ‘ఇసాకపట్నం’.గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. తమడా మీడియా ప్రోడక్షన్స్ పై రాహుల్ తమడా, సెదీప్ రెడ్డి బొర్రా నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్‌గా రూ పొందిన ఈ సిరీస్ జూలై 2 నుంచి తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఇసాకపట్నం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతూ–‘‘పవర్, సంఘర్షణతో నిండిన ప్రపంచంలో ధైర్యం, బలహీనత, ఆత్మవిశ్వాసంతో తనదైన నిర్ణయాలతో ముందుకు సాగే పాత్ర నాది.ఈ పాత్రను పోషించడం ప్రత్యేకమైన అనుభవం’’ అని చెప్పా రు. ‘‘ఇసాకపట్నం’ ఒక కల్పిత ప్రపంచంలో సాగే కథ అయినప్పటికీ పాత్రలు, వారి భావోద్వేగాలు చాలా నిజాయితీగా ఉంటాయి’’ అని గ్యారీ బీహెచ్ తెలిపారు. ‘‘ఆశ, ప్రతీకారం, అధికారం కోసం మనుషులు ఎంత దూరమైనా వెళతారనే విషయాన్ని ఈ కథ బలంగా చెబుతుంది’’ అన్నారు సముద్రఖని. నటులు నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్ మాట్లాడారు. -
ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఐశ్వర్యా రాజేశ్ ప్రస్తుతం తెలుగు, తమిళంలో మూవీస్, ఓటీటీ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు ఈమె లీడ్ రోల్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్కి రెడీ అయింది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేసి కథేంటో చెప్పే ప్రయత్నం చేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా.. అధికారిక ప్రకటన)ఐశ్వర్యా రాజేశ్, సముద్రఖని, సునీల్, నరేశ్ అగస్త్య తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సిరీస్ 'ఇసకపట్నం'. 1990ల్లో ఓ తీరప్రాంత గ్రామంలో జరిగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించారు. వచ్చే నెల 02వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. గ్యారీ బీహెచ్ ఈ సిరీస్‌కి దర్శకుడు.ట్రైలర్ బట్టి చూస్తే.. ఇసకపట్నం అనే ఊరిలో నాయుడు(సముద్రఖని) అనే పెద్దమనిషి పోర్ట్‌లో వ్యాపారాన్ని, ఊరిలో జనాల్ని తన అదుపులో ఉంచుకుని ఆజమాయిషీ చెలాయిస్తుంటాడు. ఊహించని విధంగా ఇతడి కూతురు (ఐశ్వర్యా రాజేశ్) ఇతడికి ఎదురు తిరుగుతుంది. ఈమెకు ఊరిలో కొందరు తోడవుతాడు. తర్వాత ఏం జరిగింది? కుర్చీ, అధికారం కోసం జరిగే ఈ కొట్లాట ఎక్కడకు దారితీసింది అనేది మిగతా స్టోరీ.ట్రైలర్ చూస్తే రెగ్యులర్ రొటీన్ టెంప్లేట్ స్టోరీలానే అనిపించింది. ఇప్పటివరకు ఎన్నో తెలుగు సినిమాల్లో ఈ తరహా అంశాల్ని చూసేశారు. మరి వీళ్లు ఏం కొత్తగా చూపిస్తారనేది ఇక్కడ ప్రశ్న. కొత్తగా చూపిస్తే వర్కౌట్ అవుతుంది లేదంటే జస్ట్ ఒక సిరీస్ అవుతుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి టెక్నో థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్)


