ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట | Isakapatnam Series Trailer And OTT Release Update | Sakshi
Sakshi News home page

Isakapatnam OTT: ఐశ్వర్య చేసిన ఓటీటీ డ్రామా.. ట్రైలర్ రిలీజ్

Jun 15 2026 4:38 PM | Updated on Jun 15 2026 4:46 PM

Isakapatnam Series Trailer And OTT Release Update

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఐశ్వర్యా రాజేశ్ ప్రస్తుతం తెలుగు, తమిళంలో మూవీస్, ఓటీటీ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు ఈమె లీడ్ రోల్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్‌కి ‍రెడీ అయింది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేసి కథేంటో చెప్పే  ప్రయత్నం చేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా.. అధికారిక ప్రకటన)

ఐశ్వర్యా రాజేశ్, సముద్రఖని, సునీల్, నరేశ్ అగస్త్య తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సిరీస్ 'ఇసకపట్నం'. 1990‍ల్లో ‍ఓ తీరప్రాంత గ్రామంలో జరిగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించారు. వచ్చే నెల 02వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. గ్యారీ బీహెచ్ ఈ సిరీస్‌కి దర్శకుడు.

ట్రైలర్ బట్టి చూస్తే.. ఇసకపట్నం అనే ఊరిలో నాయుడు(సముద్రఖని) అనే పెద్దమనిషి పోర్ట్‌లో వ్యాపారాన్ని, ఊరిలో జనాల్ని తన అదుపులో ఉంచుకుని ఆజమాయిషీ చెలాయిస్తుంటాడు. ఊహించని విధంగా ఇతడి కూతురు (ఐశ్వర్యా రాజేశ్) ఇతడికి ఎదురు తిరుగుతుంది. ఈమెకు ఊరిలో కొందరు తోడవుతాడు. తర్వాత ఏం జరిగింది? కుర్చీ, అధికారం కోసం జరిగే ఈ కొట్లాట ఎక్కడకు దారితీసింది అనేది మిగతా స్టోరీ.

‍ట్రైలర్ చూస్తే రెగ్యులర్ రొటీన్ టెంప్లేట్ స్టోరీలానే అనిపించింది. ఇప్పటివరకు ఎన్నో తెలుగు సినిమాల్లో ఈ తరహా అంశాల్ని చూసేశారు. మరి వీళ్లు ఏం కొత్తగా చూపిస్తారనేది ఇక్కడ ప్రశ్న. కొత్తగా చూపిస్తే వర్కౌట్ అవుతుంది లేదంటే జస్ట్ ఒక సిరీస్ అవుతుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి టెక్నో థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement