కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాను: సునీల్‌ | Sunil about Isakapatnam series | Sakshi
Sakshi News home page

కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాను: సునీల్‌

Jun 16 2026 3:20 AM | Updated on Jun 16 2026 3:20 AM

Sunil about Isakapatnam series

సముద్రఖని, ఐశ్వర్యా రాజేష్, సునీల్‌

‘‘ఇసాకపట్నం’ సిరీస్‌ చాలా వాస్తవంగా ఉంటుంది. ప్రతి పాత్రకు వారి సొంత లక్ష్యాలు, సంఘర్షణలు ఉంటాయి. ఈ సిరీస్‌లో నేను ఇప్పటి వరకు చేయని కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాను’’ అని సునీల్‌ పేర్కొన్నారు. ఐశ్వర్యా రాజేష్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో, సునీల్, నరేష్‌ అగస్త్య, రాజీవ్‌ కనకాల, మెరిన్‌ ఫిలిప్, సుధాకర్‌ కోమాకుల ఇతర పాత్రలు పోషించిన వెబ్‌ సిరీస్‌ ‘ఇసాకపట్నం’.

గ్యారీ బీహెచ్‌ దర్శకత్వం వహించారు. తమడా మీడియా ప్రోడక్షన్స్ పై రాహుల్‌ తమడా, సెదీప్‌ రెడ్డి బొర్రా నిర్మించారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తెలుగు ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌గా రూ పొందిన ఈ సిరీస్‌ జూలై 2 నుంచి తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఇసాకపట్నం’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఐశ్వర్యా రాజేష్‌ మాట్లాడుతూ–‘‘పవర్, సంఘర్షణతో నిండిన ప్రపంచంలో ధైర్యం, బలహీనత, ఆత్మవిశ్వాసంతో తనదైన నిర్ణయాలతో ముందుకు సాగే పాత్ర నాది.

ఈ పాత్రను పోషించడం ప్రత్యేకమైన అనుభవం’’ అని చెప్పా రు.  ‘‘ఇసాకపట్నం’ ఒక కల్పిత ప్రపంచంలో సాగే కథ అయినప్పటికీ పాత్రలు, వారి భావోద్వేగాలు చాలా నిజాయితీగా ఉంటాయి’’ అని గ్యారీ బీహెచ్‌ తెలిపారు. ‘‘ఆశ, ప్రతీకారం, అధికారం కోసం మనుషులు ఎంత దూరమైనా వెళతారనే విషయాన్ని ఈ కథ బలంగా చెబుతుంది’’ అన్నారు సముద్రఖని. నటులు నరేష్‌ అగస్త్య, మెరిన్‌ ఫిలిప్‌ మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement