ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్.. 'ఇసకపట్నం' కొత్త ట్రైలర్ | Isakapatnam OTT Series New Trailer | Sakshi
Sakshi News home page

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్.. 'ఇసకపట్నం' కొత్త ట్రైలర్

Jun 27 2026 6:22 PM | Updated on Jun 27 2026 6:34 PM

Isakapatnam OTT Series New Trailer

సముద్రఖని, ఐశ్వర్య రాజేశ్, సునీల్ ప్రధాన పాత్రల్లో చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'ఇసకపట్నం'. వచ్చే నెల 02న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది. కొన్నిరోజుల క్రితం ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు మరో ట్రైలర్‌ని విడుదల చేశారు. కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంగా అధికారం, రాజకీయాలు, గ్యాంగ్ వార్స్, కుటుంబ విభేదాలు తదితర అంశాలతో దీన్ని తెరకెక్కిస్తున్నారు.  తండ్రి-కూతురు మధ్య జరిగే పోరు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

(ఇదీ చదవండి: వెంకటేశ్ 'ఆదర్శ కుటుంబం' ఇదే)

పట్టణంలో రాజకీయాలు, నేరాలు, వ్యాపారాలపై పూర్తి ఆధిపత్యం చెలాయించే నాయుడికి, తన సొంత కూతురే పెద్ద సవాలుగా మారుతుంది. తన జీవితాన్ని తన నిర్ణయాలతో ముందుకు తీసుకెళ్లాలనుకునే భారతి, తండ్రికి ఎదురు నిలబడటమే స్టోరీ. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 7 ఎపిసోడ్‌లతో తీశారు. జూలై 2 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే 15 భాషల్లో సబ్‌టైటిల్స్‌తో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కు పైగా దేశాలు, ప్రాంతాల్లో అందుబాటులోకి రానుంది.

(ఇదీ చదవండి: స్టార్ హీరోతో 'సేవ్ ది టైగ‌ర్స్' సీజన్ 4)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement