స్టార్ హీరోతో 'సేవ్ ది టైగ‌ర్స్' సీజన్ 4 | Save The Tigers 4 With Tollywood Star Hero | Sakshi
Sakshi News home page

స్టార్ హీరోతో 'సేవ్ ది టైగ‌ర్స్' సీజన్ 4

Jun 27 2026 6:01 PM | Updated on Jun 27 2026 6:17 PM

Save The Tigers 4 With Tollywood Star Hero

తెలుగులో స‌క్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్ 'సేవ్ ది టైగ‌ర్స్‌' నుంచి ఇప్పటివరకు మూడు సీజ‌న్స్ వచ్చాయి. ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. దీంతో మేక‌ర్స్ ఇప్పుడీ నాలుగో సీజ‌న్‌ను రూపొందించ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈనెల 19న మూడో సీజన్.. హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తొలి రెండు సీజ‌న్స్ లానే సీజ‌న్ 3 కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యేసరికి షో ర‌న్న‌ర్ మ‌హి వి.రాఘ‌వ్ చాలా సంతోషంగా ఉన్నారు. పెళ్లి త‌ర్వాత మూడు జంట‌ల మ‌ధ్య ఉండే చిన్న చిన్న గిల్లిక‌జ్జాల‌ను కామెడీగా తెర‌కెక్కించిన తీరు ఆడియెన్స్‌కు చాలా బాగా క‌నెక్ట్ అయ్యింది. మ‌రీ ముఖ్యంగా సీజ‌న్‌ 3లో చూపించిన కాస్మిక్ ట్విస్ట్ సిరీస్‌కు ఓ కొత్త కోణాన్ని తీసుకొచ్చింది.

సేవ్ ది టైగ‌ర్స్ మూడు సీజ‌న్స్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ రావ‌టంతో మేక‌ర్స్ ఇప్పుడు నాలుగో సీజ‌న్‌ను రూపొందించ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే సీజ‌న్‌ 4లో ఓ స్టార్ హీరోను న‌టింప‌చేయ‌టానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. చిన్న‌పాటి గిల్లిక‌జ్జాలు, ఈగో స‌మ‌స్య‌ల‌తో ఉండే ఈ మూడు జంట‌ల మ‌ధ్య స్టార్ హీరో పాత్ర ఎక్క‌డ‌, ఎలా ఉండ‌బోతుందోన‌నే ఆస‌క్తి క‌లుగుతోంది. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేయ‌నున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement