రొమాంటిక్‌ థ్రిల్లర్‌ | Actor sunil launches the trailer of adhe neevu adhe nenu movie | Sakshi
Sakshi News home page

రొమాంటిక్‌ థ్రిల్లర్‌

Jul 28 2026 1:00 AM | Updated on Jul 28 2026 1:00 AM

Actor sunil launches the trailer of adhe neevu adhe nenu movie

‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ ఫేమ్‌ త్రినాథ్‌ వర్మ, యశ్వంత్‌ పెండ్యాల హీరోలుగా, ‘సిద్ధార్థ్‌ రాయ్‌’  ఫేమ్‌ తన్వీ నేగి, సహర్‌ కృష్ణన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అదే నీవు అదే నేను’. కొండల్‌ దర్శకత్వంలో శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ పై గోవిందు కాండ్రేగుల నిర్మించిన ఈ మూవీ ఈ నెల 31న విడుదల కానుంది.

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను హీరో సునీల్‌ రిలీజ్‌ చేసి, మాట్లాడుతూ–‘‘అదే నీవు అదే నేను’ ట్రైలర్‌ ఆసక్తిగా ఉంది. షాకింగ్, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఆకట్టుకున్నాయి. ఈ మూవీని థియేటర్స్‌లో చూసి, కొత్త ప్రతిభని ప్రోత్సహించాలి’’ అని తెలిపారు. ‘‘రొమాంటిక్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన చిత్రమిది’’ అన్నారు కొండల్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement