ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు: రితిక నాయక్‌ | Ritika Nayak about Korean Kanakaraju Movie | Sakshi
Sakshi News home page

ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు: రితిక నాయక్‌

Jul 28 2026 12:30 AM | Updated on Jul 28 2026 12:30 AM

Ritika Nayak about Korean Kanakaraju Movie

‘‘డైరెక్టర్‌ మేర్లపాక గాంధీగారు ‘కొరియన్‌ కనకరాజు’ కథ చెప్పినప్పుడు షూటింగ్‌కి కొరియా  వెళతాం అన్నది నన్ను మొదట బాగా ఆకట్టుకుంది(నవ్వుతూ). ఎందుకంటే నాకు కొరియన్‌ సంస్కృతి, అక్కడి సినిమాలు, కొరియన్‌ డ్రామాలు అంటే చాలా ఇష్టం. ‘కొరియన్‌ కనకరాజు’లో నేను చేసిన పాత్రకు, నా వ్యక్తిత్వానికి కొన్ని పోలికలు ఉన్నాయి. చాలా మోడ్రన్‌ అమ్మాయిగా కనిపిస్తాను.  ఫైనల్‌ ఔట్‌పుట్‌ చూస్తున్నంతసేపు నేను నవ్వుతూనే ఉన్నాను. ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో నవ్వుతూనే ఉంటారు’’ అని హీరోయిన్‌ రితిక నాయక్‌ తెలిపారు.

వరుణ్‌ తేజ్, రితిక నాయక్‌ జోడీగా, నటుడు సత్య కీలకపాత్ర పోషించిన చిత్రం ‘కొరియన్‌ కనకరాజు’. మేర్లపాక గాంధీ రచన–దర్శకత్వంలో యువీ క్రియేష న్స్, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా రితిక నాయక్‌ విలేకరులతో మాట్లాడుతూ–‘‘ఈ మూవీ షూటింగ్‌ కొంత భాగం అనంతపురంలో చేశాం.. అక్కడి జనాలు, ఆ వాతావరణం అందమైన అనుభూతిగా నిలిచిపోయింది.

వరుణ్‌ తేజ్‌గారికి గాయం ఉన్నప్పటికీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 3 గంటల వరకు షూటింగ్‌ చేశారు. యువీ క్రియేషన్స్ తో పనిచేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ . షూటింగ్‌ సమయంలో ఒకసారి నేను అనారోగ్యానికి గురయ్యాను. ఆ సమయంలో నిర్మాతలు నా గురించి ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. తమన్‌గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ప్రస్తుతం ‘మిరాయ్‌ 2’ సినిమా ప్రీ–ప్రోడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ప్రస్తుతం నేను తెలుగులో ఒక సినిమా చేస్తున్నాను’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement