హైదరాబాద్: ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు గాయమైంది. ఈరోజు(సోమవారం, జూలై 27వ తేదీ) సాయంత్రం జూ. ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్లు ఎన్టీఆర్ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసిన ఎన్టీఆర్ కార్యాలయం.. డా. జె. మధుసూదన్ రావు మరియు డా. ఆర్. ఏ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స జరుగుతున్నట్లు తెలిపింది.
ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు స్పష్టం చేసింది. అభిమానులు, శ్రేయోభిలాషులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేసింది. ఎన్టీఆర్ ఆరోగ్యం, కోలుకునే ప్రక్రియకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని తగిన సమయంలో ఎప్పటికప్పుడు అందిస్తామని ఎన్టీఆర్ టీమ్ పేర్కొంది.
NTR sustained an unfortunate shoulder injury and advised 6 to 8 weeks of complete Rest! pic.twitter.com/y5B0gYJ8kI
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) July 27, 2026


