‘హైడ్రా’ రంగనాథ్ రియాక్షన్ ఇదే! | Ranganath nath comments on high court verdict | Sakshi
Sakshi News home page

‘హైడ్రా’ రంగనాథ్ రియాక్షన్ ఇదే!

Jul 27 2026 9:24 PM | Updated on Jul 27 2026 9:43 PM

Ranganath nath comments on high court verdict

సాక్షి,హైదరాబాద్‌: కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని పేర్కొంటూ ఐపీఎస్‌ ఏవీ రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రంగనాథ్‌ స్థానంలో ఐజీ స్థాయి అధికారికి హైడ్రా కమిషనర్‌ బాధ్యతలు అప్పగించాలని తెలంగాణ చీఫ్‌ సెక్రటరీని ఆదేశించింది.

ఈ క్రమంలో హైకోర్టు తీర్పుపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ స్పందించారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే ప‌ని చేస్తున్నాను. చెరువులు.. ప్ర‌భుత్వ ఆస్తులు కాపాడటమే హైడ్రా లక్ష్యం. రూ.1.50 ల‌క్ష‌ల కోట్ల విలువ గల ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించాం. నాపై ఉన్న కోర్టు ధిక్కార కేసులన్నీ భూకబ్జాదారులవే. చట్టపరంగా కేసులు ఎదుర్కొంటాం. న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది’అని వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement