ఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ విద్యాశాఖ మంత్రిగా ఉండగానే టెన్త్ క్లాస్ పేపర్ లీక్ అయ్యిందని, మరి నీతులు మాట్లాడుతున్న ఆయన ఎందుకు రాజీనామా చేయరని ప్రశ్నించారు. ముందు సీఎం రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడిన కిషన్‌రెడ్డి.. దేశ హితం కోసం ఏ వ్యవస్థ వచ్చినా తప్పులేదని, దేశానికి నష్టం చేసే వ్యవస్థ మాత్రం ఉండకూడదన్నారు. నేషన్ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్ అని అన్నారు. దేశం డిజిటల్ చెల్లింపుల్లో అగ్రస్థానంలో ఉందన్నారాయన. తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో చాలా మార్పులు వస్తాయన్నారు కిషన్‌రెడ్డి.
తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయని, భవిష్యత్తులో ప్రధాని ,హోంమంత్రి అందరూ నేతలు తెలంగాణలో పర్యటిస్తారన్నారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కి భూమి పూజ చేయాలని, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ప్లానింగ్ జరుతుందన్నారు.


