సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. పదుల సంఖ్యలో కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని పేర్కొంటూ ఐపీఎస్ ఏవీ రంగ్‌నాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సోమవారం న్యాయస్థానంలో లోతుకుంట భూముల వ్యవహారంపై విచారణ జరిగింది. విచారణ సందర్భంగా భూముల వ్యవహారంలో హైడ్రా జోక్యాన్ని తప్పుబట్టింది. దీంతో హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు లోతుకుంట భూముల వ్యవహారంలో సారీ చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. లోతుకుంట సర్వేనం 1,2లో 40 ఏకరాల్లోకి హైడ్రా వెళ్లలేదని పేర్కొన్న రంగనాథ్.. పిటిషనరే అవాస్తవాలు చెప్పారని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై 63 కోర్టు ధిక్కరణ కేసులున్నాయన్న న్యాయస్థానం పేర్కొనగా, కోర్టులపై తనకు నమ్మకముందన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అయితే ఇన్ని ధిక్కరణ కేసులు ఎందుకు నమోదయ్యాయని హైకోర్టు ప్రశ్నించింది. అనంతరం, కోర్టు ఆదేశాల్ని దిక్కరించడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు కోర్టు దిక్కరణకు పాల్పడతారని అసహనం చేసింది. కోర్టు ధిక్కారణకు పాల్పడినందుకు హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. ఐజీ స్థాయి అధికారిని హైడ్రా కమిషనర్‌గా నియమించాలని ఆదేశించింది.


