AV ranga nath
-
సీఐపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: బాధితులు ఫిర్యాదు చేసినా కేసులు ఎందుకు నమోదు చేయలేదని హయత్ నగర్ సీఐపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ ప్లాట్లను కబ్జా చేశారని పలువురు బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా కోహెడలో వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. భూమిలో మారణాయుధాలు చూసి ఆగ్రహానికి లోనయ్యారు.ఈ సందర్భంగా..బాధితులపై దాడి జరిగినా కేసు ఎందుకు నమోదు చేయలేదని హయత్ నగర్ సీఐపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితుల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సూచించారు. వారికి న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి హైదరాబాద్ హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. బాధితుల నుంచి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫిర్యాదులను స్వయంగా స్వీకరిస్తున్నారు. అందిన ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.అయితే,ప్రజా వాణిలో కోహెడలో తమ భూమి కబ్జాకు గురైందని, ఫిర్యాదు చేసినా హయత్ నగర్ సీఐ పట్టించుకోవడం లేదంటూ ఏవీ రంగనాథ్ ఎదుట ఏకరవు పెట్టుకున్నారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు ఏవీ రంగనాథ్ స్వయంగా వివాదాస్పద స్థలాన్ని సందర్శించారు. బాధితులతో మాట్లాడారు. -
ప్రణయ్ కేసు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ షాకింగ్ కామెంట్స్
నల్లగొండ, సాక్షి: సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో(Nalgonda Miryalaguda Honour Killing Case) సంచలన తీర్పు వెలువడింది. ప్రణయ్(24)ను దారుణంగా చంపిన సుభాష్ శర్మకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది.అయితే ప్రణయ్ హత్య కేసులో విచారణ అధికారిగా ఉన్న అప్పటి అప్పటి నల్గొండ ఎస్పీ, ఐపీఎస్ అధికారి రంగనాథ్ (ప్రస్తుతం హైడ్రా కమిషనర్) కీలక వ్యాఖ్యాలు చేశారు. ప్రణయ్- అమృతల ప్రేమ అంశం టీనేజీ యువతకు గుణ పాఠంలాంటిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. టీనేజీ వయస్సులో పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, లేదంటే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అదే సమయంలో ఈ కేసు దర్యాప్తులో ఎదురైన సవాళ్లు, మారుతీరావు ప్రవర్తన, కేసును ఛేదించిన విధానం గురించి ఆయన వివరించారు. కాంట్రాక్ట్ కిల్లర్లతో హత్య..ప్రణయ్ హత్య సమయంలో నేను నల్లగొండ జిల్లా ఎస్పీగా ఉన్న ఆ సమయంలో ప్రణయ్ హత్యకేసులో మొదటి నుంచి సాక్షలు బలంగా ఉన్నారు. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయం గెలిచింది. ఈ కేసులో అన్ని కోణాలు ఉన్నాయని, కాంట్రాక్ట్ కిల్లర్లతో హత్య చేయించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరస్థులు చాలా తెలివిగా వ్యవహరించారు. కేసు మొదట్లో చాలా గందరగోళంగా ఉంది. మారుతీరావు కూడా తనకు ఏమీ తెలియదనే అన్నారు. చాకచక్యంగా ఛేదించాండీఎస్పీగా శ్రీనివాస్, ఎస్సై వెంకటేశ్వర్‌రెడ్డి, ధనుంజయ్,టాస్క్ ఫోర్స్,కానిస్టేబుల్స్, ఎస్సైలు,రైటర్స్‌తో పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసింహ, సీనియర్ అధికారురు ఐజీ స్టీఫెన్ రవీంద్ర,అప్పటి డీజీ మహేందర్‌రెడ్డిల సూచనలు,సలహాలతో ఈ కేసును చాకచక్యంగా ఛేదించాం. ప్రణయ్ హత్య తర్వాత నిందితులు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తలదాచుకున్నారు. అయినప్పటికీ టెక్నాలజీ, విచారణ సాయంతో నిందితుల్ని కేవలం వారం రోజుల వ్యవధిలో అదుపులోకి తీసుకున్నాం.ముందు లైఫ్‌లో సెటిల్ అవ్వండిప్రణయ్ -అమృత కేసు నేటి తరం బాల్యం నుంచి యవవ్వనంలోకి అడుగు పెట్టే పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఒక గుణపాఠం లాంటింది. టీనేజీ నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే సమయంలో పిల్లలు, వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. టీనేజీలోకి అడుగు పెట్టాం కదా అని ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవద్దని, జీవితంలో కొంత పరిణితి సాధించిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ముందు పిల్లలు లైఫ్‌లో స్థిరపడిన తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిది.నేటి యువతకు ఓ గుణపాఠం లాంటిందిలేదంటే ప్రణయ్ హత్య కేసుతో ఏం జరిగిందో మనం అందరం చూశాం. బాలస్వామి తన కుమారుణ్ని(ప్రణయ్),అమృత తన తండ్రిని కోల్పోయింది. వాళ్లు తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరూ సంతృప్తిగా లేరు. ఈ కేసు ద్వారా సమాజం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.అమృతమీద అమితమైన ప్రేమేప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఏ1 గా ఉన్న మారుతిరావు చనిపోవడం బాధాకరం. మారుతి రావుకి కుమార్తె అమృత అంటే అమితమైన ప్రేమ. లేక లేక పుట్టిన సంతానం. అమృత ఫొటోల్ని 15 నుంచి 20 అడుగల మేర ఫ్లెక్సీ కట్టించుకునేంత ప్రేముంది. ఆ ప్రేమే ఇన్ని అనార్ధాలకు దారి తీసింది. మారుతిరావు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఎవరైతే ప్రణయ్ హత్యకేసులో ఉన్న ఏ4 బారీ సాయంతో రియల్ ఎస్టేట్‌లో సమస్యల నుంచి బయటపడేవారు.అలాగే అమృత విషయంలో అలాగే ఆలోచించారు. డబ్బు, పరపతి ఉండొచ్చేమో.. కానీ పిల్లల టీనేజీ పెంపకం ఎలా ఉండాలనే అంశంలో అవగాహన లేకుండా పోయింది. మన పెంపకంలో ఏదైనా తప్పుంటే దానికి వేరే వాళ్లని బాధ్యుల్ని చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే అంశంపై మారుతి రావుతో మాట్లాడాను’ అని అన్నారు.పైకోర్టుకు వెళ్లినా లాభం ఉండదుఇదే కేసులో పైకోర్టులకు వెళ్లినా న్యాయం పరంగా ఎలాంటి మార్పులు ఉండదు. అంత పకడ్బందీగా ఈ కేసులో 1600 పేజీల ఛార్జ్ షీట్ వేశామని, కేసు విచారణ సమయంలో పోలీసులు మేనేజ్ చేశారంటూ కొందరు నిరాధార ఆరోపణలు చేశారని, వాటిని పట్టించుకోకుండా నిజం నిలకడ మీద తెలుస్తుందనే నమ్మకంతో ముందుకు సాగామని రంగనాథ్ ముగించారు. -
వరంగల్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు.. 18 మంది అరెస్ట్
సాక్షి, వరంగల్: వరంగల్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి అబార్షన్లు చేస్తున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ముఠాకు చెందిన 18 మంది అరెస్టు చేసినట్లు వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి లింగనిర్ధారణకు వినియోగించే మూడు స్కానర్లు, రూ. 73 వేల నగదు, 18 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా వరంగల్‌లో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో కొన్ని రోజులుగా స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తూ.. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి అబార్షన్లు చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ దీనిపై దృష్టి సారించారు. దీన్ని చేదించేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు, జిల్లా వైద్యారోగ్యశాఖ విభాగాలను రంగంలోకి దించి దర్యాప్తు చేయించారు. ‘ఆపరేషన్ దేశాయ్’ ద్వారా అక్రమంగా లింగనిర్ధారణ, అబార్షన్లు చేసే ఇద్దరు వైద్యులను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. ‘ప్రధాన నిందితుడైన వేముల ప్రవీణ్ పాత నేరస్తుడిగా గుర్తించారు. ‘గతంలో స్కానింగ్ కేంద్రంలో టెక్నీషియన్ గా పనిచేసి నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్థారణ పరీక్షలు చేసి అరెస్టయ్యాడు.గత అనుభవంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. నిందితుడు వేముల ప్రవీణ్ ఆర్ఎంపీలు, పీఆర్ఓలు, హాస్పిటల్ మెనెజ్‌మెంట్, డాక్టర్లతో కలిసి అక్రమ దందా పాల్పడుతున్నాడు. ప్రవీణ్ భార్య సంధ్యారాణితో కలిసిగోపాల్ పూర్ వెంకటేశ్వర కాలనీలో పోర్టబుల్ స్కానర్ల సహయంతో స్కానింగ్ ఏర్పాటు. ఇప్పటి వరకు వందకు పైగా అబార్షన్లు చేసిన ముఠా. స్కానింగ్ అయితే రూ. 10 వేలు తీసుకుంటున్నారు. గర్భస్రావాల కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 30 వేలు వసూలు చేస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందని సీపీ పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారిలో కొందరు ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు ఉన్నారని చెప్పారు. మరికొందరు పరారీలో ఉన్నారని తెలిపారు. చదవండి: నిజామాబాద్: సినిమా రేంజ్లో పోలీసుల ఛేజింగ్.. దొంగలపై కాల్పులు -
'పాతబస్తీలోనే ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎక్కువ'
చార్మినార్: పాతబస్తీలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి సంఖ్య ఎక్కువగా ఉందని, వారిని కట్టడి చేసేందుకు ఇక్కడ ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి తమ ఎన్ఫోర్స్మెంట్ను రెట్టింపు చేయనున్నట్లు నగర ట్రాఫిక్ డీసీపీ ఎ.వి. రంగనాథ్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం ఆయన చార్మినార్ వద్ద విలేకరులతో మాట్లాడారు. అంతేకాకుండా దక్షిణ మండలంలో 30 నుంచి 40 శాతం వరకు మాత్రమే వాహనదారులు హెల్మెట్లు ధరిస్తున్నారన్నారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈ సంఖ్య అత్యల్పమని పేర్కొన్నారు. పాతబస్తీలో నకిలీ నంబర్ ప్లేట్లు, దొంగలించిన ద్విచక్ర వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయని... ఇవీ పట్టుబడితే వాహనాలను స్వాధీనం చేసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్ ఓనర్‌షిప్‌లపై నగరంలో స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని చెప్పారు. నగరంలో దాదాపు 45 లక్షల వాహనదారులుంటే... 25 లక్షల మందికి మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్‌లున్నాయన్నారు. లేని వారంతా వెంటనే లెర్నింగ్ లైసెన్స్‌లు తీసుకోకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తామన్నారు. క్రిమినల్ కేసులు నమోదైతే పాస్‌పోర్టు సంపాదించడానికి కష్ట సాధ్యమవుతుందన్నారు. నగరంలో 7 నుంచి 10 లక్షల వాహనాలకు ఓనర్షిప్ పత్రాలు అందుబాటులో లేవనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. గతేడాది అక్టోబర్ 15వ తేదీ నుంచి ఈ అంశాలపై నగర వాహనదారులకు పది సార్లు కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. కౌన్సిలింగ్ నిర్వహించిన ఆరు నెలల అనంతరం స్పెషల్ డ్రైవ్ చేపట్టి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.