సాక్షి, సికింద్రాబాద్: బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం పరామర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.
కేసీఆర్ అంతకుముందు ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి సికింద్రాబాద్ వచ్చారు. నేరుగా ఆస్పత్రికి వెళ్లి సుదర్శన్‌రెడ్డిని పరామర్శించారు. ఆయన వెంట పార్టీ నేతలు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పల్లా రాజేశ్వర్, సంజయ్ కుమార్, సంతోష్ కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బాల్క సుమన్ తదితరులు ఉన్నారు. కేసీఆర్ రాకతో ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తరలిచ్చారు.
ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురైన సుదర్శన్‌రెడ్డిని మెరుగైన వైద్యం కోసం హనుమకొండ నుంచి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. వెంటిలేటర్‌పై ఉంచి ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలిసింది.
చదవండి: ఉత్కంఠ రేపుతున్న కార్పొరేషన్ల ఎన్నికలు


