హైదరాబాద్: హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తొలగించాలనే హైకోర్టు తీర్పును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్వాగతించారు. హైకోర్టు తీర్పు సీఎం రేవంత్‌కు చెంపదెబ్బ అంటూ మండిపడ్డ రాంచందర్‌రావు.. హైడ్రాను సైతం బ్యాన్ చేయాలన్నారు. హైడ్రాను ఏర్పాటు చేసింది రేవంత్‌రెడ్డేనని, అధికారాన్ని పావులా వాడుకున్నారని ధ్వజమెత్తారు. దీనికి పూర్తి బాధ్యత రేవంత్‌రెడ్డినే వహించాలన్నారు.
‘హిట్లర్ స్పూర్తితో హైడ్రా తెచ్చాం అని రేవంత్ గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పటికీ 63 సార్లు కన్టెంప్ట్ ఎదుర్కున్నారు రంగనాథ్. హైడ్రా కేవలం పేదల ఇండ్లు కూల్చడానికి ఉంది.. పెద్దల జోలికి పోవట్లేదు. అసలు హైడ్రాను బ్యాన్ చేయాలి’ అని డిమాండ్ చేశారు రాంచందర్‌రావు.


