అందవిహీనమైన మహిళ నువ్వే.. ఒక్క మాటతో మారిన నటి జీవితం | Apara Mehta Reveals Reason Behind Husband Leave Her | Sakshi
Sakshi News home page

Apara Mehta: 22 ఏళ్లుగా భర్తకు దూరంగా సీరియల్ నటి.. కానీ ఆయనంటే ఇష్టం

Jul 27 2026 5:50 PM | Updated on Jul 27 2026 5:56 PM

Apara Mehta Reveals Reason Behind Husband Leave Her

'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ' అనే హిందీ సీరియల్‌లో సవితా విరాణి పాత్రలో నటించి చాలా గుర్తింపు తెచ్చుకున్న నటి అపారా మెహతా తన వ్యక్తిగత జీవితం గురించి తొలిసారిగా ఎమోషనల్ అయ్యారు. నటుడు దర్శన్ జరివాలాతో తన వైవాహిక జీవితంలో జరిగిన పరిణామాల గురించి మాట్లాడుతూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

(ఇదీ చదవండి: నటుడు చనిపోయిన 16 ఏళ్లకు సొంతింటి కల సాకారం)

1982లో అపారా మెహతా, దర్శన్ జరివాలా పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఓ కూతురు ఉంది. అయితే 2003 నుంచి ఇద్దరూ విడివిడిగానే జీవిస్తున్నారు. కానీ అధికారికంగా అయితే విడాకులు తీసుకోలేదు.

'అప్పట్లో ఓసారి షోలు చేసేందుకు అమెరికా వెళ్లాను. ఆ టైంలో మా పెళ్లిరోజు వచ్చింది. దీంతో దర్శన్‌కు ఫోన్ చేశాను. 'మనిద్దరం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి' అని ఆయన అన్నారు. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత దర్శన్ నాతో విడిపోవాలని కోరారు. 'నేను నిన్ను ప్రేమించడం లేదు. నువ్వు నాకు నచ్చడం లేదు. నా జీవితంలో చూసిన అత్యంత అందవిహీనమైన మహిళ నువ్వే' అని నాతో చెప్పారు. ఆ మాటలు విన్న వెంటనే షూటింగ్‌కు వెళ్లిపోయాను. ఆ రోజు వరసగా సీన్స్ ఉండేసరికి జరిగిన విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకునే పరిస్థితిలో లేను. తర్వాత ఆలోచించినప్పుడు ఆయన నిజంగానే అలా చెప్పారా అని నాకు అనిపించిందని.

తర్వాత ఒకరోజు దర్శన్ ఇల్లు విడిచి వెళ్లిపోయారు. అయినప్పటికీ మా మధ్య ఇప్పటికీ మంచి రిలేషన్ కొనసాగుతోంది. అది ఇప్పటికీ మా ఇల్లే. ఆయన తిరిగి రావాలనుకుంటే తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అయితే ఆయన తిరిగి రాకపోవచ్చని నాకు తెలుసు. ఆయనలాంటి వ్యక్తి నాకు మళ్లీ దొరకరు. నాలాంటి వ్యక్తి కూడా ఆయనకు దొరకరు. విడివిడిగా ఉంటున్నప్పటికీ ఇప్పటికీ మేమిద్దరం ఒకరి మాటను మరొకరం పూర్తిగా అర్థం చేసుకునేంత అవగాహనతో ఉన్నాం' అని అపారా మెహతా అన్నారు. 'గాంధీ మై ఫాదర్', 'గురు', 'అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ' తదితర చిత్రాల్లో నటించిన దర్శన్ జరివాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

(ఇదీ చదవండి: ఎన్నిసార్లు విడాకులు అడిగినా ఆమె ఇవ్వలేదు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement