అదృష్టం అంటే ఈ హీరోయిన్‌దే.. తొలి చిత్రమే రూ.300 కోట్ల బడ్జెట్‌! | Kalyani Priyadarshan In Ranveer Singh New Movie | Sakshi
Sakshi News home page

Kalyani Priyadarshan: హీరోయిన్ ఫేట్ మార్చిన ఒకే ఒక్క సినిమా

Jul 24 2026 11:09 AM | Updated on Jul 24 2026 11:23 AM

Kalyani Priyadarshan In Ranveer Singh New Movie

ఏ రంగంలోనైనా సక్సెస్‌ ప్రభావం గట్టిగా ఉంటుంది. అలా టాలీవుడ్‌, మాలీవుడ్‌, కోలీవుడ్‌లో మంచి విజయం కోసం ఎదురుచూసిన హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్‌. తండ్రి ప్రియదర్శన్.. దర్శకుడు కావడంతో సులభంగానే ఇండస్ట్రీలోకి వచ్చింది. కానీ కెరీర్ ప్రారంభంలో హిట్స్ పడక డీలా పడింది. తమిళంలో శింబు 'మానాడు' సక్సెస్ ఈమెకు కాస్త ఊరటనిచ్చింది. అలాంటిది కల్యాణి.. రీసెంట్ టైంలో చేసిన మలయాళ చిత్రం 'లోక' మూవీ అనుహ్యంగా బ్లాక్‌బస్టర్ అయింది. రూ.300 కోట్ల కలెక్షన్స్ సాధించింది.

(ఇదీ చదవండి: ‍'జన నాయగన్' తొలిరోజు కలెక్షన్ ఎన్ని కోట్లు?)

ఉమెన్‌ సెంట్రిక్‌ సూపర్ హీరో కథతో తీసిన ఈ సినిమా.. కల్యాణి ప్రియదర్శన్‌కు యాక్షన్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చిపెట్టింది. దీంతో ఈ బ్యూటీకి ఇప్పుడు బాలీవుడ్‌ నుంచి పిలుపొచ్చినట్లు తెలుస్తోంది. 'ధురంధర్' ఫేమ్ రణ్‌వీర్ సింగ్‌.. త్వరలో జాంబి థ్రిల్లర్‌ స్టోరీతో తీస్తున్న రూ.300 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో కల్యాణిని హీరోయిన్‌గా తీసుకున్నారట.

ఇందులో కల్యాణిది యాక్షన్‌ రోల్ అని తెలుస్తోంది. ఆగస్టులో ఈ ప్రాజెక్ట్ మొదలు కానుందని టాక్. దీని తర్వాత తనకు స్టార్‌ ఇమేజ్‌ తెచ్చిపెట్టిన 'లోక' సీక్వెల్‌లో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం అవుతుందని సమాచారం. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement