ఐశ్వర్యా రాజేష్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో, సునీల్, నరేష్ అగస్త్య, రాజీవ్ కనకాల, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమాకుల ఇతర పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ‘ఇసాకపట్నం’.
గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. తమడా మీడియా ప్రోడక్షన్స్ పై రాహుల్ తమడా, సెదీప్ రెడ్డి బొర్రా నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్‌గా రూ పొందిన ఈ సిరీస్ జూలై 2 నుంచి తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘ఇసాకపట్నం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.


