కొత్తింట్లోకి అడుగుపెట్టిన తెలుగు సీరియల్ జంట | Telugu Serial Actors Eknath Harika New House Warming Ceremony Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Eknath Harika: సీరియల్ జోడీ నూతన గృహప్రవేశం.. ఫొటోలు వైరల్

Jul 17 2026 12:15 PM | Updated on Jul 17 2026 12:24 PM

Telugu Serial Actors Eknath Harika New House Warming Ceremony

తెలుగు సీరియల్స్ చూసేవాళ్లు ఏక్ నాథ్, హారిక గురించి తెలిసే ఉంటుంది. 'నేను శైలజ' సీరియల్‌లో నటించిన వీళ్లు.. దాని షూటింగ్ టైంలో ప్రేమలో పడ్డారు. ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెబితే తొలుత ఒప్పుకోలేదు. దీంతో కొన్నాళ్లు దూరంగా ఉన్నారు. తర్వాత మళ్లీ పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

(ఇదీ చదవండి: 'ది ఒడిస్సీ' సినిమా ‍ట్విటర్ రివ్యూ)

సీరియల్స్ చేస్తూ బిజీగా ఉండే ఈ జంట.. సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు చేస్తూ అలరిస్తుంటారు. రీసెంట్‌గానే హైదరాబాద్‌లో కొత్త ఇల్లు కొనుగోలు చేసిన ఏక్‌నాథ్-హారిక.. కొన్నాళ్ల క్రితం గృహప్రవేశం చేశారు. అందుకు సంబంధించిన వీడియోని హారిక ఇప్పుడు తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో తోటీ సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇకపోతే ఈ ఏడాది బిగ్‌బాస్ షోలోకి వీళ్లిద్దరూ గానీ ఇద్దరిలో ఒకరు గానీ వచ్చే అవకాశముంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'బంగారం'.. మరోవైపు సమంతకు సీమంతం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement