పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటుడు | Telugu TV Serial Actor Krishna Reddy Wedding Ties Knot With Sandhya In Traditional Wedding Ceremony, Video Went Viral | Sakshi
Sakshi News home page

Krishna Reddy: నటుడి పెళ్లిలో సందడి చేసిన సీరియల్ స్టార్స్

May 11 2026 2:25 PM | Updated on May 11 2026 2:46 PM

Telugu Serial Actor Krishna Reddy Wedding

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కొత్త జీవితాన్ని మొదలుపెడుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి తెలుగు సీరియల్ నటుడు కృష్ణారెడ్డి కూడా చేరిపోయాడు. సొంతూరు బలభద్రపురంలో జరిగిన ఈ వేడుకలో సంధ్య అనే అమ్మాయి మెడలో మూడుముళ్లు వేశాడు. ఈ వేడుకకు తోటి సీరియల్ నటీనటులు హరిత, జాకీ, పవన్ సాయి, సునంద తదితరులు హాజరై నూతన వధూవరుల్ని దీవించారు.

(ఇదీ చదవండి: విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత త్రిష తొలి పోస్ట్)

బిగ్‌బాస్ 9 ఫేమ్ తనూజ గతంలో నటించిన 'ముద్దమందారం' సీరియల్‌తో కృష్ణారెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం 'ముత్యమంతా ముగ్గు' సీరియల్ కూడా చేశారు. ప్రస్తుతం 'జానకి పరిణయం' ధారావాహికతోపాటు పలు షార్ట్ ఫిల్మ్స్‌లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు.

అయితే 2023లోనే కృష్ణారెడ్డి.. స్వాతి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. మరి ఏమైందో ఏమో గానీ అది రద్దయినట్లు ఉంది. ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ఈ విషయం కాస్త క్లారిటీ వచ్చింది.

(ఇదీ చదవండి: 'లవ్ టుడే' నటి ప్రేమ వివాహం.. దర్శకుడితో ఏడడుగులు)

Advertisement
 
Advertisement
Advertisement