విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత త్రిష తొలి పోస్ట్ | Trisha First Post After Vijay CM Ceremony | Sakshi
Sakshi News home page

Trisha-Vijay: చీరలో మెరిసిపోతూ త్రిష.. ప్రేమతో పోస్ట్

May 11 2026 12:04 PM | Updated on May 11 2026 12:16 PM

Trisha First Post After Vijay CM Ceremony

తమిళనాడు ముఖ్యమంత్రిగా హీరో విజయ్.. ఆదివారం ఉదయం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు విజయ్ భార్య పిల్లలు రాలేదు. తల్లిదండ్రులు మాత్రమే వచ్చారు. వీళ్లతో పాటు హీరోయిన్ త్రిష కూడా ఆకుపచ్చని చీరలో దర్శనమిచ్చింది. విజయ్ మాట్లాడుతున్నప్పుడు ఈమె ఎమోషనల్ అవుతూ కనిపించింది. ఇకపోతే విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత త్రిష పెట్టిన తొలి పోస్ట్ ఆసక్తికరంగా అనిపిస్తోంది.

విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం పట్టుచీర కట్టుకొచ్చిన త్రిష.. ఈ చీరని ఎంతో ప్రేమతో డిజైన్ చేశారని చెప్పుకొచ్చింది. ఈ ఫొటోలని షేర్ చేసి 'ప్రేమ ఎ‍ప్పుడూ గొప్పదే' అనే క్యాప్షన్ పెట్టింది. ఇది విజయ్‌ని ఉద్దేశించే పెట్టిందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

స్టార్ హీరో విజయ్, త్రిష కలిసి తమిళంలో పలు సినిమాలు చేశారు. అయితే విజయ్ తన భార్య సంగీత నుంచి విడాకులు తీసుకోవడానికి త్రిషనే కారణమనే కామెంట్స్ చాన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే విజయ్-త్రిష కలిసి కనిపించడం, ఎన్నికల ఫలితాల తర్వాత త్రిష.. విజయ్ ఇంటికి వెళ్లడం, తాజాగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరవడం లాంటివి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయాయి.

(ఇదీ చదవండి: సీఎంగా విజయ్ ప్రమాణం.. త్రిష స్పెషల్ విషెస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement