సీఎంగా విజయ్ ప్రమాణం.. త్రిష స్పెషల్ విషెస్ | Actress Trisha Special congratulatons To New Tamilnadu CM Vijay | Sakshi
Sakshi News home page

Trisha: సీఎంగా విజయ్.. త్రిష ప్రత్యేక శుభాకాంక్షలు

May 10 2026 1:11 PM | Updated on May 10 2026 2:46 PM

Actress Trisha Special congratulatons To New Tamilnadu CM Vijay

కోలీవుడ్ హీరో విజయ్‌కు హీరోయిన్ త్రిష శుభాకాంక్షలు తెలిపింది. విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణం స్వీకారం సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ చెప్పింది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందని  పేర్కొంది. విజయ్‌కు నా మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని త్రిష వెల్లడించింది. చెన్నైలోని నెహ్రు స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకారానికి హీరోయిన్ త్రిష కూడా హాజరైంది. ఈ కార్యక్రమంలో త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.

విజయ్‌తో త్రిష రిలేషన్..

ఎన్నికల ముందు నుంచే త్రిష- విజయ్ రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. విజయ్ భార్య సంగీత కూడా విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి. అంతేకాకుండా ఇద్దరు కలిసి జంటగా పెళ్లికి హాజరుకావడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే త్రిష బర్త్‌ డే రోజున ఎన్నికల ఫలితాలు రావడం.. విజయ్ అత్యధిక సీట్లు గెలవడంతో ఆనందం మరింత రెట్టింపైంది. త్రిషకు విజయ్ బర్త్ డే గిఫ్ట్ అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. వీరిద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మరింత కాలం వేచి చూడాల్సిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement