'లవ్ టుడే' నటి ప్రేమ వివాహం.. దర్శకుడితో ఏడడుగులు | Actress Raveena Ravi Marries Director Devan Jayakumar | Sakshi
Sakshi News home page

Raveena Ravi: కలిసి సినిమా చేశారు.. ఇప్పుడు సింపుల్‌గా పెళ్లి

May 11 2026 10:46 AM | Updated on May 11 2026 11:10 AM

Actress Raveena Ravi Marries Director Devan Jayakumar

'లవ్ టుడే' ఫేమ్ ప్రముఖ నటి రవీనా రవి పెళ్లి చేసుకుంది. గతంలో కలిసి పనిచేసిన దర్శకుడు దేవన్ జయకుమార్‌తో ఏడడుగులు వేసింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆదివారం ఉదయం ఈ శుభకార్యం జరగ్గా.. పలువురు నటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కేరళకు చెందిన రవీన్ రవి.. డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్ నటి. తల్లి శ్రీజ కూడా నటి కావడంతో ఆరేళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చేసింది. 2012 నుంచి పూర్తిస్థాయిలో డబ్బింగ్ ఆర్టిస్టుగా మారిపోయింది. 'జవాన్'లో దీపికా పదుకొణెకు తమిళ-తెలుగు వెర్షన్స్‌లో, తమిళ 'గేమ్ ఛేంజర్'లో కియారా అడ్వాణీకి ఈమెనే డబ్బింగ్ చెప్పింది. ఓకే బంగారం, ప్రేమమ్ (మడోన్నా సెబాస్టియన్), 2.0 (అమీ జాక్సన్), నవాబ్ (ఐశ్వర్యా రాజేశ్), శ్యామ్ సింగరాయ్ (మడోన్నా సెబాస్టియన్) తదితర తెలుగు చిత్రాల్లోనూ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది.

కేరళలో పుట్టినప్పటికీ తెలుగు, తమిళ, మలయాళంలో డబ్బింగ్ ఆర్టిస్టుగా బోలెడన్ని మూవీస్ చేసింది. 2017 నుంచి నటిగా అడపాదడపా కనిపిస్తూనే ఉంది. ప్రదీప్ రంగనాథన్ 'లవ్ టుడే' మూవీలో హీరోకి అక్క పాత్రలో నటించి మెప్పించింది. ఇకపోతే 2023లో 'వాలాట్టి' అనే కుక్కల సినిమాకు డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేసింది. ఆ టైంలో ఈ చిత్ర దర్శకుడు దేవన్ జయకుమార్‌తో ప్రేమలో పడింది. ఇప్పుడు పెద్దల్ని ఒప్పించి పెళ్లితో ఒక్కటయింది. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement