పిల్లలు కావాలన్నాడు.. విడాకులు ఇచ్చేశా: సీరియల్ నటి | TV Actress Akanksha Chamola Reveals Shocking Reason Behind Divorce From Gaurav Khanna, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

Akanksha Chamola: ఆయన తప్పు చేయలేదు.. ఈ విషయం ముందే చెప్పా

Jun 30 2026 1:29 PM | Updated on Jun 30 2026 1:51 PM

Serial Actress Akanksha Chamola Reveals Divorce Reason

నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం లాంటి వార్తలు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాయి. అయితే మనస్పర్థల కారణంగా విడిపోయాం అనే కారణాన్ని దాదాపు సినీ జంటలన్నీ చెబుతుంటాయి. కానీ ఓ సీరియల్ నటి మాత్రం షాకింగ్ రీజన్ చెప్పింది. తన భర్త.. పిల్లలు కావాలని అడగడంతోనే విడాకులు ఇచ్చేశానని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: ‍కుమారస్వామి ఎక్కడివాడు? ఎన్టీఆర్ సినిమా వల్ల తెలుగు vs తమిళం)

హిందీ సీరియల్ నటి ఆకాంక్ష చమోలా.. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న 'లాక్ అప్' అనే రియాలిటీ షో రెండో సీజన్‌లో పాల్గొంది. రెండో ఎపిసోడ్‌లో మాట్లాడుతూ తన భర్త గౌరవ్ ఖన్నా నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు మూడో ఎపిసోడ్‌లో ఈ నిర్ణయానికి దారితీసిన పరిస్థితుల గురించి బయటపెట్టింది. సహ కంటెస్టెంట్స్‌తో మాట్లాడుతూ ఈ విషయాల్ని పంచుకుంది.

'మా పెళ్లి టైంలోనే నాకు తల్లికావడంపై ఎలాంటి ఆసక్తి ఉండేది కాదు. కాలక్రమణా అది మారుతుందేమో అనుకున్నా. కానీ తర్వాత నేను పిల్లల్ని కనడానికి, తల్లి అయ్యేందుకు సరైన వ్యక్తి కాదని తెలుసుకున్నాను. అదే సంగతి గౌరవ్‌కి కూడా చాన్నాళ్ల క్రితమే చెప్పాను. అంగీకరించాడు కూడా. కానీ కాలం గడిచేకొద్ది ఆయన అభిప్రాయం మారింది. ప్రస్తుతం పిల్లలు కావాలని అంటున్నాడు. కానీ నేను ఆయన కోరిక నెరవేర్చలేను. ఇది నాకు తెలిసిన వెంటనే.. ఒకవేళ ఈ కారణంగా నన్ను విడిచిపెట్టాలనుకుంటే ఆ నిర్ణయం కూడా నాకు సమ్మతమే అని గౌరవ్‌తో కూడా చెప్పాను' అని ఆకాంక్ష పేర్కొంది.

(ఇదీ చదవండి: రాజకీయ ఎంట్రీపై యూటర్న్.. లారెన్స్ షాకింగ్ నిర్ణయం)

'చాలామంది కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడం, పిల్లల్ని కనడం లాంటి వాటి కోసం పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఆ కోణంలో చూస్తే గౌరవ్ తప్పు చేయట్లేదు. కానీ నాకే పిల్లల్ని కనాలనే ఆసక్తి లేదు. ఆయన కావాల్సిన జీవితాన్ని నేను ఇవ్వలేకపోతున్నాను. అందుకే ఆయనని ఆ పరిస్థితిలో ఉంచాలని నేను కోరుకోవడం లేదు' అని ఆకాంక్ష చెప్పుకొచ్చింది.

ఇకపోతే ఆకాంక్ష.. సంతోషి మా, యే హై ఆషికీ, క్రైమ్ పట్రోల్ తదితర సీరియల్స్ చేసింది. 2016 నవంబరులో నటుడు గౌరవ్ ఖన్నాని ఈమె పెళ్లి చేసుకుంది. అయితే గతేడాది బిగ్‌బాస్ 19వ సీజన్‌లో పాల్గొన్నప్పుడు కూడా గౌరవ్ ఖన్నా ఆకాంక్ష ఇప్పుడు చెప్పిన విషయాన్నే చెప్పాడు. తన భార్య, పిల్లలను కనకూడదనే నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఆ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని, తనకు మాత్రం కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని, పిల్లలు కావాలనే కోరిక ఉందని వెల్లడించాడు. అయితే ఇదంతా చెప్పి సానుభూతి పొందాలని ప్రయత్నం చేయట్లేదని స్పష్టం చేశాడు.

(ఇదీ చదవండి: సీరియల్ నటికి నడిరోడ్డుపై వేధింపులు! వీడియో వైరల్)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement