రాజకీయ ఎంట్రీపై యూటర్న్.. లారెన్స్ షాకింగ్ నిర్ణయం | Raghava Lawrence Wont Contest Trichy By Election Latest | Sakshi
Sakshi News home page

Ragava Lawrence: విజయ్ ఖాళీ చేసిన స్థానంలో పోటీ? ఎట్టకేలకు క్లారిటీ

Jun 30 2026 12:52 PM | Updated on Jun 30 2026 12:58 PM

Raghava Lawrence Wont Contest Trichy By Election Latest

కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఎట్టకేలకు మౌనం వీడాడు. కొన్నిరోజుల క్రితం నుంచి ఇతడు రాజకీయాల్లోకి రానున్నాడని.. సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి ఈస్ట్ స్థానంలో జరిగే ఉపఎన్నికల్లో నిలబడతాడనే రూమర్స్ చాలా వినిపించాయి. మూడు వారాల క్రితం దీని గురించి ప్రెస్ మీట్ పెట్టిన లారెన్స్.. చెప్పి చెప్పకుండానే మాట్లాడాడు. ఇప్పుడు ఎట్టకేలకు పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశాడు.

(ఇదీ చదవండి: ‍కుమారస్వామి ఎక్కడివాడు? ఎన్టీఆర్ సినిమా వల్ల తెలుగు vs తమిళం)

రెండు వారాల క్రితం ఓ వీడియో పోస్ట్ చేసిన లారెన్స్.. నేను రాజకీయాల్లోకి రావడం పట్ల మీ సలహాలను కామెంట్స్‌లో పంచుకోండి. మీరు నో అని చెబితే నేను రాజకీయాల్లోకి రాను. సమాజానికి నా నిస్వార్థ సేవ కొనసాగిస్తా. మీరు ఎస్ అంటే మాత్రం వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. మీ అందరి ఆశీస్సులతో నేను ఈ ప్రయాణాన్ని ఎప్పుడు, ఎవరితో ప్రారంభించాలనుకుంటున్నానో వెల్లడిస్తా అని అన్నారు.

తాజాగా మంగళవారం మధ్యాహ్నం దాదాపు 16 నిమిషాల వీడియో పోస్ట్ చేసిన లారెన్స్.. చాలా విషయాలు మాట్లాడాడు. నేను తిరుచిరాపల్లి తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేయను. కానీ రాజకీయాల్లోకి రానని మాత్రం అనుకోవద్దు అని చెప్పాడు. దీంతో విజయ్ ఖాళీ చేసిన స్థానంలో పోటీ చేస్తాడని ఆశపడ్డ అభిమానులకు నిరాశ ఎదురైంది. అయితే లారెన్స్ ఊపు చూసి పక్కాగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడని భావించారు. మరి ఏమైందో ఏమో గానీ సడన్ యూటర్న్ తీసుకుని అందరికీ షాకిచ్చాడు.

(ఇదీ చదవండి: సీఎం విజయ్‌లా రాజకీయాల్లోకి సూర్య.. ఇది క్లారిటీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement