'ది ఒడిస్సీ' సినిమా ‍ట్విటర్ రివ్యూ | The Odyssey Movie Twitter Review | Sakshi
Sakshi News home page

The Odyssey Twitter Review: మాస్టర్ పీస్.. 'ఒడిస్సీ' గురించి ఇంకేమంటున్నారు?

Jul 17 2026 10:51 AM | Updated on Jul 17 2026 11:02 AM

The Odyssey Movie Twitter Review

హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ లేటెస్ట్ సినిమా 'ది ఒడిస్సీ' ఎట్టకేలకు(జూలై 17 నుంచి) థియేటర్లలోకి వచ్చేసింది. పూర్తిగా ఐమాక్స్ కెమెరాలతో తీసిన ఈ చిత్రం తెలుగులోనూ రిలీజైంది. అయితే చూసిన ప్రతిఒక్కరూ వావ్, మాస్టర్ పీస్, మూవీ ఆఫ్ ది డెకేడ్ లాంటి మాటలు తప్పితే వేరొకటి అనట్లేదు. ఇంతకీ సోషల్ మీడియాలో ఏమంటున్నారు? ట్విటర్ టాక్ ఏంటి?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సాయిపల్లవి సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

'ది ఒడిస్సీ' అనేది గ్రీకు పురాణాల్లోని ఒడియాసిస్ అనే రాజు కథతో తీసిన సినిమా. పదేళ్ల పాటు ఓ యుద్ధంలో పోరాడి గెలిచిన ఒడియాసిస్.. తన ఇథికా రాజ్యానికి తిరిగెళ్లిపోయి భార్య, కొడుకుని కలవాలనుకుంటాడు. కానీ సముద్ర ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. అలా పదేళ్ల పాటు రకరకాల రాజ్యాలు తిరుగుతూ ఎ‍ట్టకేలకు సొంత రాజ్యానికి చేరుకుంటాడు.

అయితే పేరుకే స్టోరీ సింపుల్‌గా అనిపిస్తున్నప్పటికీ నోలన్.. మూవీని మరో లెవల్లో తీశాడని, ఈ దశాబ్దంలోనే ఇది అత్యుత్తమ సినిమా అని అంటున్నారు. తొలి అరగంట కథలో లీనం కావడానికి కాస్త టైమ్ పడుతుందని, తర్వాత రెండున్నర గంటల పాటు ఒడియాసిస్ రాజుతో మనం కూడా జర్నీ చేస్తామని, ఆయన బాధ, ఆనందం లాంటివి ఫీలవుతామని నెటిజన్లు అంటున్నారు. థియేటర్లలో ‍అస్సలు మిస్ కావొద్దని గుర్తుచేస్తున్నారు.

(ఇదీ చదవండి: క్రిస్టోఫర్ నోలన్ 'ద ఒడిస్సీ'.. ఎందుకు చూడాలి?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement