పలు దేశాల్లో నిషేధించిన వివాదాస్పద సినిమా.. తెలుగు రివ్యూ | Citizen Vigilante Movie Review Telugu | Sakshi
Sakshi News home page

Citizen Vigilante Review: రియలస్టిక్ యాక్షన్ థ్రిల్లర్.. ఈ మూవీ ఎలా ఉందంటే?

Jul 7 2026 1:00 PM | Updated on Jul 7 2026 2:19 PM

Citizen Vigilante Movie Review Telugu

వివాదాస్పద అంశాల్ని చూపించారనే కారణాలతో కొన్నిసార్లు కొన్ని సినిమాల్ని ప్రభుత్వాలే నిషేధిస్తుంటాయి. రీసెంట్‌గా మన దేశంలో 'సత్లుజ్'కి అలాంటి పరిస్థితే ఎదురైంది. గత మూడేళ్లుగా సెన్సార్ బోర్డ్ దగ్గర ఇబ్బందులు పడ్డ ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. కానీ రెండు రోజుల్లోనే దాని నుంచి కూడా తీసేశారు. ఇంతకు మించి ఇబ్బందులు ఎదుర్కొంది 'సిటిజన్ విజిలాంట్' అనే ఇంగ్లీష్ మూవీ. యూరప్‌లోని జర్మనీ, యూకే, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో దీనిని అస్సలు విడుదల కానివ్వలేదు. మరి అంతలా ఇందులో కాంటవర్సీ ఏముంది? దీనిని ఎక్కడ చూడొచ్చు?

(ఇదీ చదవండి: ఈ సిరీస్ చూశాక ఫోన్ వాడాలంటే భయపడతారు.. తెలుగు రివ్యూ)

కథేంటి?
క్రొయేషియాలో స్థిరపడిన అమెరికన్ బిలినీయర్ శాండర్స్ (ఆర్మీ హామర్).. తన దేశంలో అక్రమ వలసదారుల కారణంగా జరుగుతున్న హింస, అత్యాచారాలు, హత్యలు లాంటి దారుణాలు చూసి చలించిపోతాడు. న్యాయవ్యవస్థ, పోలీసులు.. సదరు నేరస్తులని ఎలాంటి శిక్ష విధించకుండా విడిచిపెట్టేయడం లాంటివి చూస్తాడు. దీంతో కోపమొచ్చి విజిలెంట్‌గా మారి సదరు నేరస్తులని, వాళ్లని రక్షిస్తున్న నాయకుల్ని చంపడం మొదలుపెడతాడు. మరి చివరకు ఏమైంది? శాండర్స్ అనుకున్నది సాధించాడా లేదా అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతిదేశం 'అక్రమ వలసలు' అనే అతిపెద్ద సమస్యని ఎదుర్కొంటోంది. అయితే చాలా దేశాలు ఇలాంటి వాళ్లని గుర్తించి తిరిగి వారి సొంత ప్రాంతాలకు పంపించేస్తుండగా యూరోప్‌లో మాత్రం వీళ్లని చూసిచూడనట్లు వదిలేస్తున్నారు! పైపెచ్చు సకల సౌకర్యాలు ఇస్తున్నారు. దీంతో వాళ్ల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఆశ్రయిమిచ్చిన దేశంలోని ఆడపిల్లల్ని, మహిళల్ని లైంగికంగా వేధిస్తూ అశాంతి కలిగిస్తున్నారు. అలాంటి వాళ్లని నిర్ధాక్షిణ్యంగా చంపుకొంటూ, గాయపరుస్తూ వెళ్లే ఓ కడుపు మండిన వ్యక్తి కథే ఈ సినిమా.

అంతర్జాతీయ వార్తలు చదివే వాళ్లకు యూరోపియన్ దేశాల్లో పాక్ గ్రూమింగ్ గ్యాంగ్ చేసే అరాచకాల గురించి తెలిసే ఉంటుంది. ఆయా దేశాల్లోని టీనేజీ అమ్మాయిలని కిడ్నాప్ చేసి లేదంటే వల వేసి అత్యాచారాలకు తెగబడటం లాంటివి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కానీ వీళ్లపై అక్కడి న్యాయస్థానాలు గానీ పోలీసులు గానీ సరైన చర్యలు తీసుకోవడం లేదు. చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే విషయాన్ని ఈ మూవీలోనూ పచ్చిగా చూపించారు. వలసదారుల నేరాలను అరికట్టడంలో తాము విఫలమవుతున్నామని చూపిస్తే ప్రభుత్వం, న్యాయస్థానాలు ఊరుకుంటాయా? అస్సలు ఊరుకోవు. మూవీని మొత్తానికే నిషేధించారు.

నిషేధం అయితే విధించారు కానీ మిగిలిన దేశాలకు చెందిన వాళ్లు చూడకుండా యూరోపియన్ ప్రభుత్వం, న్యాయస్థానాలు ఆపలేకపోయాయి. ప్రస్తుతం అమెరికాలో అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీల్లో అద్దె విధానంలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు ట్విటర్‌లో ఈ సినిమా మొత్తాన్ని వివిధ హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసేశారు. మన దేశంలోనూ అందుబాటులో ఉంది.

యూరోపియన్ దేశాల్లో భద్రత అనేది గాల్లో దీపంలా ఎలా తయారైంది? ఆయా దేశాలకు చెందిన వేలాది మంది అమ్మాయిలు..  పాక్, ఆఫ్రికా నుంచి అక్రమంగా వలస వెళ్లిన యువకుల కారణంగా ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటారనేది ఇందులో రా గా చూపించారు. ఇక క్లైమాక్స్‌లో హీరో.. ఓ ఫ్యామిలీతో పాటు కొందరు కుర్రాళ్లని చంపే సీన్ అయితే ఒళ్లు జలదరించేలా చేస్తుంది. సదరు అత్యాచారాలు చేసే యువకుల మనసులని వాళ్ల కుటుంబాలే ఎలా కలుషితం చేస్తున్నాయనేది కూడా ఇందులో క్లియర్ గా చూపించారు. కేవలం గంటన్నర నిడివితో ఉండే ఈ సినిమా ప్రారంభంలో కాస్త సాగదీతగా అనిపిస్తుంది కానీ కాస్త ఓపికతో చూస్తే యూరోపియన్ దేశాల అసలు స్వరూపం బయటపడుతుంది.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: ఓటీటీలో కామెడీ సిరీస్.. 'సూపర్ సుబ్బు' రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement