ముంబయి వీధుల్లో హాలీవుడ్ స్టార్స్ సందడి.. వీడియో వైరల్ | The Odyssey Cast In Mumbai coffee cafe video goes viral | Sakshi
Sakshi News home page

The Odyssey Team: ముంబయి కేఫ్‌లో క్రిస్టోఫర్ నోలన్ టీమ్ సందడి.. వీడియో వైరల్

Jul 12 2026 9:16 PM | Updated on Jul 12 2026 9:16 PM

The Odyssey Cast In Mumbai coffee cafe video goes viral

ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన దర్శకత్వంలో వస్తోన్న ది ఓడిస్సీ మూవీ జూలై 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ది ఒడిస్సీ ప్రీమియర్ షో కోసం ముంబయికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన టీమ్ ముంబయిలోని ఒలింపియా కాఫీ హౌస్‌లో సందడి చేశారు.

ముంబయి నగరంలోని స్థానిక కొలాబాలో ఉన్న 108 ఏళ్ల పురాతనమైన ప్రసిద్ధ ఒలింపియా కాఫీ హౌస్‌కు విచ్చేసిన క్రిస్టోఫర్ నోలన్ టీమ్.. అదే కాఫీ హౌస్‌లో టీ తాగి, బన్ మస్కాను రుచి చూశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను యూనివర్సల్ పిక్చర్స్ ఇండియా సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

ఈ సందర్భంగా క్రిస్టోఫర్ నోలన్, టామ్ హాలండ్, మాట్ డామన్‌లను కాఫీ హౌస్‌లో చూడగానే అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. దీంతో అందరూ వెంటనే తమ ఫోన్లు తీసి ఫోటోలు, వీడియోలు తీసేందుకు ఎగబడ్డారు. ఈ హాలీవుడ్ అగ్రతారలు ముంబయిలో బన్ మస్కా ఆస్వాదిస్తూ చాలా సంతోషంగా కనిపించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement